రఘునందన్ రావుపై రేపిస్టు వ్యాఖ్యలు: కమలాకర్ రెడ్డిపై కమలం వేటు

By narsimha lodeFirst Published Oct 7, 2020, 3:47 PM IST
Highlights

రఘు నందన్ రావు లాంటి రేపిస్ట్ కు  టికెట్ ఇవ్వడంతో బీజేపీ  ప్రతిష్ట దిగజారుతుందని బీజేపీ నేత తోట కమలాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
రఘు నందన్ రావు కు దుబ్బాక టికెట్ విషయం లో బీజేపీ అధిష్టానం పునరాలోచించాలని ఆయన కోరారు.

దుబ్బాక: రఘు నందన్ రావు లాంటి రేపిస్ట్ కు  టికెట్ ఇవ్వడంతో బీజేపీ  ప్రతిష్ట దిగజారుతుందని బీజేపీ నేత తోట కమలాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రఘు నందన్ రావు కు దుబ్బాక టికెట్ విషయం లో బీజేపీ అధిష్టానం పునరాలోచించాలని ఆయన కోరారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రఘునందన్ రావుకు దుబ్బాకలో బీజేపీ టికెట్టు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఒక రేపిస్ట్ ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ అధ్యక్షుడు మీద ఆరోపణలు వచ్చిన వెంటనే తొలగించారు. మరి అదే రఘునందన్ వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. 

రేప్ కేస్ నుండి నిర్దోషిగా వస్తే తప్ప పార్టీ కార్యకలాపాలలో పాల్గొనని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో  నిర్దోషివి అయ్యావా అని ఆయన ప్రశ్నించారు. 

ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే తప్ప దుబ్బాక గుర్తుకు రాదని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికా మీరు టికెట్టు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.
 రఘు నందన్ రావు ఏనాడూ బిజెపి  కోసం పని చేయలేదన్నారు...పార్టీ ని అడ్డు పెట్టుకొని లక్షలాది రూపాయలు సంపాదించాడని ఆయన ఆరోపించారు.

రాజకీయాల్లో విలువల కోసం పాటు పడ్డ అద్వానీ,వాజ్ పాయి, బంగారు లక్ష్మణ్,మోడీ లాంటి నేతలు ఉన్న బీజేపీలో రఘునందన్ లాంటి నీచ మైన వ్యక్తికి టిక్కెట్ రావడం బాధాకరమన్నారు. రఘు నందన్ రావు రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ టికెట్ సంపాదిస్తున్నాడని ఆయన విమర్శించారు. 

మంత్రి శ్రీనివాస్ అనే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాత్రమే పార్టలో రఘు నందన్ రావు కు మద్దతుగా నిలిచి టిక్కెట్ ఇప్పిస్తున్నాడన్నారు. .
రఘు నందన్ రావు కు మంత్రి శ్రీనివాస్ కు ఉన్న సంబంధం ఏమిటో త్వరలోనే బయట పడుతుందని ఆయన చెప్పారు.

 రఘు నందన్ రావు తన స్వార్థం కోసం దుబ్బాక నియోజకవర్గం లోని కరుడు గట్టిన బీజేపీ కార్యకర్తల ను ,నాయకులను  పార్టీ నుండి బయటకు పంపించాడని ఆయన ఆరోపించారు. 

రఘు నందన్ రావు ఇప్పటివరకు నిలబడ్డ ఏ ఎన్నికల్లోనూ గెలవని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.దుబ్బాక నుండి రెండు సార్లు పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదన్నారు. ఎంపీ కి పోటీ చేసి బీ.. ఫామ్ వచ్చిన తర్వాత కనీసం ప్రచారం కూడా చేయలేదన్నారు.జడ్పీటీసీ గా పోటీచేసికూడా ఓడి పోయాడు..MLC గా పోటీ చేసి ఓడి పోయాడని చెప్పారు.

రఘు నందన్ రావు చరిత్ర అంతా అవినీతి మయమన్నారు. సిద్ధిపేట నుండి కట్టు బట్టలతో పటాన్ చెరు నుండి వెళ్లిన రఘునందన్ రావు కోట్లకు ఎలా  పడగెత్తాడని ఆయన ప్రశ్నించారు.

also read:దుబ్బాక బీజేపీలో కలకలం: రఘునందన్ రావుకు కమలాకర్ రెడ్డి సెగ

దుబ్బాక నియోజకవర్గం లో ఒక్క చనిపోయిన ఒక్క బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని కూడా రఘు నందన్ రావు ఆదుకోలేదన్నారు. డబ్బు కోసం నయీమ్, అసదుద్దీన్ ఒవైసీ,కేసులు వాదించిన ఘనత రఘు నందన్ రావుదని ఆయన విమర్శించారు. 

అమాయక మహిళనను వ్యభిచారం వృత్తి లోకి దించి విదేశాల కు అక్రమ రవాణా చేశాడని రఘునందన్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుల పక్షాన కేసు వేస్తానని బెదిరించి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేశాడన్నారు.ఇలాంటి అవినీతి పరునికు బీజేపీ టిక్కెట్ ఎలా ఇస్తుందని ఆయన పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు.

బీజేపీ నుండి కమలాకర్ రెడ్డి బహిష్కరణ

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావుపై ఆరోపణలు చేసిన తోట కమలాకర్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంది. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి రఘునందన్ రావుకు బీజేపీ నాయకత్వం టికెట్ ఇచ్చింది. రఘునందన్ రావుకు టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ కమలాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన వెంటనే బీజేపీ నాయకత్వం ఆయనను పార్టీ నుండి బహిష్కరించింది.

click me!