మిషన్ కాకతీయ కాదు.. కమీషన్ల కాకతీయ, అందుకే ఈ స్థాయిలో పంట నష్టం : డీకే అరుణ

Siva Kodati |  
Published : Jul 30, 2023, 08:11 PM IST
మిషన్ కాకతీయ కాదు.. కమీషన్ల కాకతీయ, అందుకే ఈ స్థాయిలో పంట నష్టం : డీకే అరుణ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ కాకతీయపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.  చెక్ డ్యాంల నిర్మాణంలో లోపాల కారణంగా వందలాది ఎకరాలు నీట మునిగి పంట నష్టం జరిగిందని ఆమె ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ కాకతీయపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఆదివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి బాధితులను పరామర్శించారు. బీజేపీ అన్ని విధాలా అండగా వుంటుందని అరుణ పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడితో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయను కమీషన్ల కాకతీయగా మార్చారని డీకే అరుణ ఆరోపించారు.

చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకం పనులు చేపట్టారని ఆమె మండిపడ్డారు. అందుకే చెరువులకు గండ్లు పడ్డాయని.. వరల బారిన పడిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నది లేదని అరుణ దుయ్యబట్టారు. చెక్ డ్యాంల నిర్మాణంలో లోపాల కారణంగా వందలాది ఎకరాలు నీట మునిగి పంట నష్టం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి.. వెంటనే పరిహారం అందజేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Also read : దళిత బంధు: ఎన్నికల కోసం దళితులతో రాజకీయమా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

అంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేవలం ఎన్నికల స్టంట్ కోసమే దళిత బంధు తెర మీదికి తీసుకువచ్చారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసమే దళిత బంధు తీసుకువచ్చారా? దళిత బంధు స్కీం ఆధారంగా దళితులతో రాజకీయం చేస్తున్నారా? అంటూ ప్రశ్నలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ తెలుగు వార్తా పత్రిక క్లిప్‌ను జత చేసి కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నలు వేశారు.

ఖజానాలో పైసలు లేని కారణంగా దళిత బంధు ఎట్లా అమలు చేసేదేని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఆ కథనం సారాంశంగా ఉన్నది. ఆ కథనం క్లిప్‌ను ట్విట్టర్‌లో పేర్కొంటూ ఖాజానాలో పైసలు లేవా? అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. దళిత బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడిందా? అని పేర్కొన్నారు. జులైలోనే దళిత బంధు పథకం అమలు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందనీ, ఇప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదని ఆయన ట్వీట్ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?