హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ .. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన బైకర్, ఇద్దరూ స్పాట్‌లోనే

Siva Kodati |  
Published : Jul 30, 2023, 07:35 PM IST
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ .. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన బైకర్, ఇద్దరూ స్పాట్‌లోనే

సారాంశం

హైదరాబాద్ బొల్లారంలో హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఉప్పల్‌కు చెందిన ఆదిత్య.. ఓ స్పోర్ట్స్ బైక్‌తో అత్యంత వేగంగా వారిని ఢీకొట్టాడు. 

పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా.. భారీగా జరిమానాలు విధిస్తున్నా హైదరాబాద్‌లో మాత్రం హిట్ అండ్ రన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బండ్లగూడలో మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న తల్లీకూతుళ్లను కారు ఢీకొట్టడంతో వారు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి అదే తరహా ఘటన జరిగింది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలను బైక్ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. బొల్లారంలో ఈ ఘటన జరిగింది. రీసాలా బజార్‌కు చెందిన రాధిక (48) కలాసిగూడ సాయికాలనీకి చెందిన బాలమని యాదవ్ అనే మహిళలు మంచి స్నేహితులు. గడిచిన కొన్నేళ్లుగా వీరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. స్లానిక కంటోన్మెంట్ బోర్డు పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. 

Also Read: హైదరాబాద్‌: మద్యం మత్తులో మహిళల రాష్ డ్రైవింగ్... స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు , వీడియో వైరల్

దీనిలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో పార్క్ వద్దకు బయల్దేరారు. ఈ క్రమంలో ఉప్పల్‌కు చెందిన ఆదిత్య.. ఓ స్పోర్ట్స్ బైక్‌తో అత్యంత వేగంగా వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాధిక స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. బాలమని యాదవ్‌ను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ఆమె తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??