Hyderabad: బీజేపీ పగటి కలలు కంటోందనీ, వారికి దక్షిణ భారతం అర్థం కావడం లేదని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. దక్షిణ భారతదేశం వారిని (బీజేపీ) ఇప్పటికే తీవ్రంగా తిరస్కరించిందని పేర్కొన్నారు.
BRS leader & national spokesperson Dasoju Sravan: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బీజేపీ పగటి కలలు కంటోందనీ, వారికి దక్షిణ భారతం అర్థం కావడం లేదన్నారు. దక్షిణ భారతదేశం వారిని (బీజేపీ) ఇప్పటికే తీవ్రంగా తిరస్కరించిందని పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించడానికి తెలంగాణ ముఖద్వారం అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేత, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పందించారు. "దక్షిణ భారతదేశం వారిని (బీజేపీ) తీవ్రంగా తిరస్కరించింది. ఇక్కడ వారి పాదముద్రలు పడలేవు. బీజేపీకి దక్షిణ భారతం అర్థం కావడం లేదు. దక్షిణ భారతదేశ ఆకాంక్షలు, సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడం కంటే భావోద్వేగాలను ఎలా రెచ్చగొట్టాలో బీజేపీకి తెలుసు. అలా కాకుండా సంస్కృతి-సంప్రదాయాలను ప్రశంసించే ప్రజా విధానం, రాజకీయ కథనంతో ముందుకు రావాలి" అని ఆయన అన్నారు. అలాగే, తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ ను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ భావిస్తోందని శ్రవణ్ ఆరోపించారు.
ముఖ్యంగా తెలంగాణకు గంగా జమున తెహజీబ్ అని పేరుంది. తాము అన్నదమ్ముల్లా జీవిస్తున్నామనీ, కానీ దురదృష్టవశాత్తూ బీజేపీ ఆ గంగా జమున తెహజీబ్ను విచ్ఛిన్నం చేయాలనీ, తెలంగాణ తిరస్కరిస్తున్న సామాజిక వ్యవస్థను నాశనం చేయాలనుకుంటోందని అన్నారు. "బీజేపీ పార్టీలో ముప్పై గ్రూపులున్న వారికి మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ అయినా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా, బీజేపీ నుంచి ఎవరైనా తెలంగాణలో వచ్చి శిబిరాలు వేసినా వారి అడుగులు ఇక్కవ నిలబడవు. కచ్చితంగా మూడు సీట్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది. మరింత దిగజారి మూడో స్థానానికి పడిపోయింది. వారిని తెలంగాణ తరిమికొడుతుందని" ఆయన అన్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ.. తెలంగాణలో పార్టీకి సమర్థ నాయకత్వం లేదన్నారు. వారి కథనాలను ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరని తెలిపారు. అందుకే వారు ఈగల్లా తెలంగాణకు వచ్చి ఏదో రాజకీయ అలజడి వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో వారు విజయం సాధించలేరని అన్నారు.
దుబ్బాకలో గెలిచినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కాబట్టి తెలంగాణ వారికి ప్రాతిపదిక కాదని నేను అనుకుంటున్నాను. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. కానీ అది తెలంగాణలో కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందనీ, సాగునీరు అందించడంలో తెలంగాణ నంబర్ వన్, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో రామరాజ్యం నడుస్తోందనీ, బీజేపీ డ్రామాను ప్రజలు అర్థం చేసుకున్నారని, వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.