ఏం చేయకుండా పదవులెలా వస్తాయి.. తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం క్లాస్

By Siva KodatiFirst Published Jul 31, 2021, 7:28 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ నేతలకు జాతీయ నేతలు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. పార్టీ నిర్మాణం, ఓట్ల సాధన, వనరుల  సమీకరణ ఇలా ఏది చేయలేని వారికి పార్టీ పదవులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 

తెలంగాణ బీజేపీ నేతలపై జాతీయ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎన్నేళ్లు వున్నది ముఖ్యం  కాదు.. పార్టీకి ఏం చేశారన్నదే ముఖ్యమని రాష్ట్ర నేతలకు సూచించారు. పని తీరును బట్టే పదవులు వుంటాయని స్పష్టం చేశారు.  పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్స్‌తో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, ఓట్ల సాధన, వనరుల  సమీకరణ ఇలా ఏది చేయలేని వారికి పార్టీ పదవులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. నేతలు ఏదో ఒక సబ్జెక్ట్‌లో నిష్ణాతులు కావాలని సూచించారు. ప్రతి ఆఫీస్ బేరర్ అన్ని జిల్లాల్లో పర్యటించాలని, వ్యాక్సిన్ సెంటర్లు, రేషన్ షాపులను సందర్శించాలని ఆదేశించారు. సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పారు సంతోష్. 

ALso Read:బీజేపీకి మరో షాక్: రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

కాగా, తెలంగాణ బీజేపీకి వరుసగా నేతలు గుడ్ బై చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డిలు బీజేపీని వీడారు. వీరి బాటలోనే మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన హైకమాండ్... సంతోష్‌ను హైదరాబాద్‌కు పంపింది. 

click me!