లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య : పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు

By Siva KodatiFirst Published Jul 31, 2021, 5:54 PM IST
Highlights

హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమా పెళ్లి వ్యవహారమే ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు

దరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమా పెళ్లి వ్యవహారమే ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వికారాబాద్‌ లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి, మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన రాములు చిన్నప్పటి నుంచి స్నేహితులని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని సంతోషి రాములుపై ఒత్తిడి తెచ్చేదని, మానసిక ఒత్తిడి తట్టుకోలేని రాములు, సంతోషిని హోటల్‌కు తీసుకువచ్చి చంపేసినట్లు పోలీసులు అంటున్నారు.

అయితే ఈ కేసులో ఇప్పటికి ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో అనుమానాలు తెలెత్తున్నాయి. నెల రోజుల కిందట సంతోషి తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా తమకెలాంటి అభ్యంతరం లేదని ఆమె సోదరుడు రాఘవేందర్‌ చెప్పాడు.  అయితే రాములు కుటుంబ పెద్దలు మాత్రం కులాంతర వివాహానికి ఒప్పుకోవడం లేదని సంతోషి చెప్పింది. ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని రాఘవేందర్ ఆమెను ఓదార్చాడు. 

ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మాదాపూర్‌లోని లెమన్ ట్రీ హోటల్‌కు బుధవారం మధ్యాహ్నం 12:30కు వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మొదటి రోజు గదిలో బాగానే ఉన్నారని... మరుసటి రోజు పెళ్లికి సంబంధించి వాదోపవాదాలు జరిగాయని  హోటల్ సిబ్బంది  చెబుతున్నారు. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవట్లేదని, తానేమీ చేయలేని స్థితిలో ఉన్నానని సంతోషికి రాములు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

అయినప్పటికీ పెళ్లికి సంతోషి పట్టుపట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన రాములు సంతోషినిని బ్లేడ్‌తో బాత్‌రూమ్‌లో గొంతుకోశాడు. తీవ్రంగా రక్తం కారుతుండడంతో ఆమె గొంతుకు టవల్‌ అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసింది. అయినా రక్తం ఆగకపోవడంతో బాత్‌రూంలో పడిపోయింది. చనిపోయిందని నిర్ధారించుకున్న రాములు అదే బ్లేడుతో గొంతుకోసుకుని అనంతరం ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!