చేరికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. తెలంగాణలో ప్రత్యేక సర్వేలు, రిజల్ట్‌ను బట్టే కొత్త నేతలకు గ్రీన్‌సిగ్నల్

Siva Kodati |  
Published : Jul 29, 2022, 06:35 PM ISTUpdated : Jul 29, 2022, 06:38 PM IST
చేరికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్.. తెలంగాణలో ప్రత్యేక సర్వేలు, రిజల్ట్‌ను బట్టే కొత్త నేతలకు గ్రీన్‌సిగ్నల్

సారాంశం

తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అడుగులు వేస్తోంది. మేధావులు, విద్యావంతుల‌ను పార్టీలోకి చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ప్రత్యేక సర్వే చేయిస్తోంది. 

తెలంగాణలో బీజేపీ (bjp) అధిష్టానం సర్వేలు చేపట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించింది. సర్వేల ఆధారంగా నేతలకు గాలం వేస్తోన్న బీజేపీ హైకమాండ్ నియోజకవర్గాల్లోని బలమైన నేతలను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీకి ఆదేశాలు జారీ చేశారు కేంద్ర నేతలు. విభేదాలను పక్కనబెట్టాలని సూచించిన పార్టీ పెద్దలు.. బలమైన నేతలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

మరోవైపు... తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డేందుకు అడుగులు వేస్తోంది. మేధావులు, విద్యావంతుల‌ను పార్టీలోకి చేర్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి టి. కృష్ణ ప్ర‌సాద్ బీజేపీలో చేరే అవకాశం క‌నిపిస్తుండ‌ట‌మే దీనికి నిద‌ర్శ‌నం. తెలంగాణకు చెందిన ఆయ‌న 1987- బ్యాచ్ IPS ఆఫీస‌ర్. ఆయ‌న 2020 సంవ‌త్స‌రంలో ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. వాస్త‌వానికి కృష్ణ ప్ర‌సాద్ నేడు (జూలై 29న) బీజేపీలో చేరాల్సి ఉంది. కానీ ఆగస్టు 2వ తేదీన పార్టీలో చేరుతార‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌నతో పాటు పలు వ్యాపార సంస్థలలో కీల‌క స్థానాల్లో ఉన్న గ్రూప్ కూడా పార్టీలో చేరాల‌ని భావిస్తోంద‌ని తెలుస్తోంది.

Also Read:ఈడీ, సీబీఐలంటే భయం ఎందుకు : కేసీఆర్‌ ప్రభుత్వంపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు

రాజ‌కీయ నేత‌ల‌నే కాకుండా అన్ని వ‌ర్గాల్లో పేరున్న వారిని పార్టీలోకి తీసుకురావాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (narendra mpodi) , కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah) తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు సూచించారు. మాజీ పోలీస్ ఆఫీస‌ర్ గా ఉన్న కృష్ణ ప్ర‌సాద్.. పేదలకు సహాయం చేసే సామాజిక సేవా సంస్థను నడుపుతూ దానికి అనుబంధంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. 

ఇప్పటికే ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్ల‌ను బీజేపీ తన వైపున‌కు తిప్పుకుంది. ఎక్సైజ్ శాఖ కమిషనన‌ర్ గా ఉద్యోగ విర‌మ‌ణ చేసిన ఆర్ చంద్ర వదన్, కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఏపీలో పనిచేసిన తెలుగు అధికారి రత్న ప్రభ చాలా కాలం క్రితం పార్టీలో చేరారు. హైదరాబాద్ లో బీజేపీలో చేరిన ఆమె తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సా ర్సీపీ అభ్యర్థిపై పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా పార్టీలో చేరారు. ఈ మాజీ బ్యూరోక్రాట్లతో పాటు ఉద్యో గుల సంఘం నాయకుడు, తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ ను, అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డిని త‌న వైపున‌కు ఆకర్షించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు