
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా బాలికల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్ధినులను సీనియర్ విద్యార్ధినులు వేధిస్తున్నారంటూ బాధితుల తల్లిదండ్రులు కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు వేధింపులు తట్టుకోలేక ఇప్పటికే పలువురు విద్యార్ధినులు టీసీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.