తెలంగాణ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన మీద వేటు పడింది.
హైదరాబాద్ : బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనని తెలంగాణ బిజెపి రాష్ట్ర పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన మీద వేటు వేసినట్లు తెలుస్తోంది.
యెన్నం శ్రీనివాసరెడ్డి 2002లో టీఆర్ఎస్ పార్టీలో తన రాజకీయప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 2009లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అక్కడినుంచి 2012లో బీజేపీలో చేరారు. ఆ యేడు మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఇబ్రహీం మీద 1859 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
'ఆయన ఆంధ్రకి వెళ్తే మంచిది..': కేవీపీకి వీహెచ్ స్ట్రాంగ్ వార్నింగ్
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి వి శ్రీనివాస్ గౌడ్ చేతిలో 2535 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2017 నవంబర్ 23న బిజెపికి రాజీనామా చేశారు.
2016లో చెరుకు సుధాకర్తో కలిసి యెన్నం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమ వేదికను స్థాపించారు. 2017 లో ఏర్పాటు అయిన తెలంగాణ ఇంటి పార్టీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2019లో తిరిగి బిజెపిలో చేరారు.