Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం రేవంత్, గవర్నర్ తమిళసై ..  ఏ రోజంటే..?

By Rajesh KarampooriFirst Published Feb 22, 2024, 6:34 AM IST
Highlights

Medaram Jatara:  మేడారం మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మేడారం లో సమ్మక్కసారలమ్మ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్నారు. అదే రోజు గవర్నర్ తమిళసై, ఇతర ప్రముఖులు రానుండటంతో పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Medaram Jatara: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మేడారం మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మేడారం సందర్శించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో మేడారం జాతరకు వెళ్లి.. వనదేవతలను దర్శించుకోనున్నారు. అదే రోజు  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా జాతరకు హాజరుకానున్నట్టు సమాచారం. ఇతర ప్రముఖులు రానుండటంతో పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
మేడారం మహాజాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సారలమ్మ, పగిడిద్ద రాజు అడవి నుండి  గద్దెలకు చేరుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తొలి రోజే మేడారం ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ , ఆంధ్రప్రదేశ్ నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.  ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లనీ పూర్తి చేసింది. జాతర వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ దగ్గరుండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా,  
 
మేడారం జాతరను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇలా.. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ  సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం. అని పేర్కొన్నారు. 

Latest Videos

click me!