వచ్చే ఎన్నికలే లక్ష్యం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు 'ది కేరళ స్టోరీ'ని ప్రదర్శిస్తున్న బీజేపీ

By Mahesh Rajamoni  |  First Published May 16, 2023, 4:57 PM IST

Hyderabad: కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. దీంతో ఇప్పటినుంచే రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి వ్యూహాలు ర‌చిస్తున్నాయి. దూకుడు పెంచిన బీజేపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా అన్ని వ‌న‌రుల‌ను వాడుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పుడు వివాదాస్ప‌ద చిత్రం 'ది కేర‌ళ స్టోరీ'ని ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకుంది. 
 


Telangana Assembly Election-BJP: తెలంగాణలో ఓటర్లను ఆకట్టుకునేందుకు 'ది కేరళ స్టోరీ'ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్రదర్శిస్తోంది. 250 మంది విద్యార్థినుల కోసం 'ది కేరళ స్టోరీ' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను బీజేపీ ఆదిలాబాద్ యూనిట్ ఏర్పాటు చేసింది. దీని వెనుక రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల వ్యూహం కూడా క‌నిపిస్తోంది. గ‌త మూడు రోజులుగా నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో ‘ది కేరళ స్టోరీ’ చిత్ర ప్రదర్శనపై కొనసాగుతున్న ఉత్కంఠకు సోమవారం తెరపడిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బీజేపీ ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) క్షేత్రస్థాయిలో తన మద్దతు పునాదిని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో తెలంగాణ యువ ఓటర్లపై దృష్టి సారించింది. 'ది కేరళ స్టోరీ' చిత్రాన్ని తెలంగాణలో ప్రదర్శించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇటీవల బీజేపీ ఆదిలాబాద్ యూనిట్ స్థానిక థియేటర్లో 250 మంది బాలికల కోసం 'ది కేరళ స్టోరీ' సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. దేశంలో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపడమే ఈ స్క్రీనింగ్ వెనుక పార్టీ ఉద్దేశం. అయితే, తెలంగాణలో హిందూ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేందుకు బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 'లవ్ జిహాద్'పై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు పార్టీ వర్గాలను ఉటంకిస్తూ డీసీ పేర్కొంది. ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ హిందూ మహిళలు ఉగ్రవాదుల ఉచ్చులో పడకుండా అడ్డుకోవడమే ఈ సినిమా లక్ష్యమని అన్నారు. 

Latest Videos

'ది కేరళ స్టోరీ' చుట్టూ వివాదమే..

32 వేల మంది మహిళలు అదృశ్యమై ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో చేరారని 'ది కేరళ స్టోరీ' ట్రైలర్ పేర్కొనడంతో వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రకటన రాజకీయ చర్చకు దారితీసింది, చాలా మంది నాయకులు ఈ ప్రకటన వాస్తవికతను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఈ చిత్రాన్ని వెనక్కి తీసుకుని కేరళకు చెందిన ముగ్గురు మహిళల కథగా ఈ చిత్రాన్ని తన ట్రైలర్ వివరణలో పేర్కొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యత

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ), బీజేపీలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిని టీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 88 సీట్లు సాధించి మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కు 21 నుంచి 19 సీట్లు తగ్గగా, ఎంఐఎంకు ఏడు స్థానాలు దక్కాయి. అయితే గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీట్ల శాతం ఐదు నుంచి ఒకటికి పడిపోయింది. ఈ త‌ర్వాత చోటుచేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో ఈ బ‌లాలు మారాయి. ప్ర‌స్తుతం తెలంగాణలో 'ది కేరళ స్టోరీ'ని ప్రదర్శించడం ద్వారా యువ ఓటర్లను ప్రభావితం చేసి రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

click me!