తెలంగాణ ఎన్నికలు.. పోటీ నుంచి తప్పుకున్న చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగేందుకు సిద్దమైన సత్యనారాయణ ముదిరాజ్ పోటీ నుంచి తప్పుకున్నారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగేందుకు సిద్దమైన సత్యనారాయణ ముదిరాజ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. అనారోగ్య సమస్యల కారణంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్టుగా చెప్పారు. వైద్య సలహా మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలోనే సత్యనారాయణ ముదిరాజ్ పేరు ఉంది. ఈ క్రమంలోనే ఆయన చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయితే కొద్దిరోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆరోగ్య సమస్యలతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నట్టుగా తెలిపారు. 

Latest Videos

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఎంఐఎంకు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ 2014, 2018లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

click me!