కవితకు మరో షాక్: స్వగ్రామంలో బీజేపీ అభ్యర్ధి గెలుపు

By narsimha lodeFirst Published Jun 4, 2019, 12:44 PM IST
Highlights

నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు మరో షాక్ తగిలింది. తన స్వగ్రామం పోతంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమి పాలయ్యాడు.  ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్ధి కె. రాజు విజయం సాధించారు. ఇప్పటికే ఎంపీగా కవిత ఓటమి పాలైంది.

నిజామాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు మరో షాక్ తగిలింది. తన స్వగ్రామం పోతంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమి పాలయ్యాడు.  ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్ధి కె. రాజు విజయం సాధించారు. ఇప్పటికే ఎంపీగా కవిత ఓటమి పాలైంది.

నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం పోతంగల్ కవిత స్వగ్రామం. కవిత భర్తది ఇదే గ్రామం. ప్రతి ఎన్నికల్లో కూడ కవిత నిజామాబాద్ జిల్లాలోనే తన భర్తతో కలిసి ఓటు హక్కును వినియోగించుకొంటారు.

తాజాగా జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో పోతంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్ధి కత్రోజి రాజు 86 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో  నిజామాబాద్ నుండి ఎంపీ  స్థానంలో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో  కవిత ఓటమి పాలయ్యారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తాను దత్తత తీసుకొన్న ఎర్రవెల్లి మండలం మర్కూక్ గ్రామంలో టీఆర్ఎస్  అభ్యర్ధి గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలంలోని రుద్రారం ఎంపీటీసీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకొంది.

సంబంధిత వార్తలు

కల్వకుంట్ల కవిత ఓటమితో స్వంత పార్టీ నేతల విందు: కారణమిదే

ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత

click me!