మునుగోడు బైపోల్ 2022: కౌంటింగ్ హల్ లో గోల్ మాల్ చేయలేరన్న కోమటిరెడ్డి

By narsimha lode  |  First Published Nov 6, 2022, 11:58 AM IST


 కౌంటింగ్  హల్ లో గోల్   మాల్  చేయలేరదని బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి చెప్పారు.అధికారుల మధ్య సమన్వయం లేని కారణంగానే ఫలితాల వెల్లడిలో జాప్యం చోటు చేసుకుందన్నారు.
 



 మునుగోడు:  మునుగోడు  కౌంటింగ్  హల్ లో  గోల్ మాల్ చేయలేరని  బీజేపీ  అభ్యర్ధి  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఆదివారంనాడు ఆయన  కౌంటింగ్  సెంటర్  వద్ద మీడియాతో మాట్లాడారు.గోల్ మాల్  చేయడం అంత ఈజీ కాదన్నారు.కౌంటింగ్ సెంటర్లో  తమ  కౌంటింగ్  ఏజంట్లున్నారన్నారు.  తాను విజయం  సాధిస్తానని  ఆయన  ధీమాను వ్యక్తం  చేశారు.  

నైతికంగా  తాను  విజయం సాధించినట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చెప్పారు.  అధికారుల మధ్య సమన్వయం లేని కారణంగా  ఫలితాల వెల్లడిలో  జాప్యం  జరుగుతుందని ఆయన  అభిప్రాయపడ్డారు.ఎన్నికల ప్రచారంలో  టీఆర్ఎస్  నాయకత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను  పెట్టి  ఓటర్లను ప్రలోభాలకు  గురి చేశారని ఆయన  ఆరోపించారు.  తనను తన మనుషులను  ప్రచారం చేయకుండా  అడ్డుకొనే ప్రయత్నం  చేశారని  ఆయన ఆరోపించారు.ఎన్నికల  కమిషన్  సరిగా  వ్యవహరించలేదని  ఆయన  ఆరోపించారు.   ధర్మం గెలుస్తుందని   ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

Latest Videos

undefined

also read:మునుగోడు బైపోల్ 2022: ఫలితాల వెల్లడిలో జాప్యంపై బండి సంజయ్ ఆగ్రహం

ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా  చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా  చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్   రెడ్డి విజయం  సాధించారు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది.
 


 

click me!