బిజెపి కిషన్ రెడ్డికి పార్టీ ఆఫీసులోనే అవమానం

First Published Dec 21, 2017, 8:06 PM IST
Highlights
  • సొంత పార్టీ ఆఫీసులోనే ఇరకాటం
  • చెప్పుకోలేక అవస్థలు
  • గుర్రుగా ఉన్న కిషన్ రెడ్డి అభిమానులు

బిజెపి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కిషన్ రెడ్డికి ఇప్పుడు సొంత పార్టీ ఆఫీసులోనే అవమానం కలుగుతున్నది. ఈ దెబ్బతో ఆయన ఆఫీసుకు రావాలంటేనే ఇబ్బందిపడుతున్నారు. గతంలో మాదిరిగా పార్టీ ఆఫీసుకు రాకుండా చుట్టపు చూపుగా వస్తున్నారు. ఇంతకూ బిజెపి కిషన్ రెడ్డికి సొంత ఆఫీసులో అవమానం ఏదంబ్బా అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి. 

తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డికి సొంత ఆఫీసులోనే ఇబ్బందికర పరిస్థితిలు నెలకొన్నాయి. మింగలేక కక్కలేక అన్నట్లుంది ఆయన పరిస్థితి అని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. పార్టీ కార్యలయానికి వచ్చినా పార్టీ కార్యలయంలో ఆయనకు ఛాంబర్ లేకపోవడంతో ఎక్కడ కూర్చొవాలో తెలియక వచ్చినప్పుడల్లా ఖాళీ రూంల కోసం వెతుకుతున్నారట. 

కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరికంటే ఎక్కవ కాలం దాదాపు ఆరేళ్లు అధ్యక్ష భాద్యతలు నిర్వహించారు. గత రెండేళ్ల  క్రితం ఆయన అధ్యక్ష బాధ్యతలు వదిలి ప్రస్తుతం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఆయన హాయంలోనే రాష్ట్ర పార్టీ కార్యలయం సుందరీకణ కోసం దాదాపు జాతీయ పార్టీ ఆరు కోట్ల కేటాయించింది. కానీ ప్రస్తత అధ్యక్షుడు లక్ష్మన్ భాత్యలు తీసుకున్న తరువాత పార్టీ కార్యలయం రెనెవెషన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండు, మూడో , నాలుగో అంతస్థులు ట్రిస్టార్ హోటల్ తలపించే స్థాయిలో పార్టీ కార్యాలయాన్ని తీర్చి దిద్దారు.  రెండో అంతస్థులో పార్టీ అద్యక్షుడు ఆయన టీం కూర్చొవడానికి ప్రధాన కార్యదర్శులకు కార్యదర్శులకు ప్రత్యేక రూంలు కేటాయించారు. కానీ.. పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కు ప్రత్యేక రూం కేటాయించలేదు. దీంతో పార్టీ కార్యలయానికి కిషన్ రెడ్డి వస్తే కూర్చొవడానికి అనేక అవస్థలు పడుతున్నారట. దీంతో ఆయన వర్గం పార్టీ తీరుపై గుర్రుగా ఉందని చెబుతున్నారు.

రెండు అంతస్థుల్లో పార్టీ కార్యాలయాన్ని ట్రిస్టార్ హోటల్ వలే తీర్చి దిద్దినా పార్టీలో ముఖ్యపదవుల్లో ఉన్న నేతలకు ప్రత్యేక రూంలు కేటాయించకపోవడం వల్ల పార్టీలో కొత్త చర్చ ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక రూంలు కేటాయించి ఫ్లోర్ లీడర్ కు రూం కేటాయించకపోవడంతో కిషన్ రెడ్డి పార్టీ కార్యలయానికి వచ్చి కాన్ఫిరెన్స్ రూంలో కూర్చొని ఆయన కోసం వచ్చిన వారికి కలువాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి తన సన్నిహితులు వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. అందిరికి కేటాయించినప్పుడే ఫార్టీ కార్యాలయంలో ఫ్లోర్ లీడర్, లేదా మాజీ అధ్యక్షుల కోసం ప్రత్యేక రూం కేటాయిస్తారని అందరూ భావించారట. అదీ కేటాయింకపోవడంతో చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయానికి రాకుండా తన ఎమ్మెల్యే ఆఫీస్ వద్దే కార్యకర్తలను కలవాల్సి వస్తుందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. 

మాజి అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి  వచ్చే కార్యకర్తలను కలువడానికి పార్టీ కార్యలయంలో కూర్చొవడానికి రూంలేక అనేక అవమానాలకు గురవుతున్నట్లు ఆయన మద్దతు దారులు చెప్పుకుంటున్నారు. కావాలనే లక్ష్మన్ రూంలు కేటాయించకుండా అవమానిస్తున్నారని కొందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 

click me!