హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నారు.ఈ మేరకు రాజేందర్ పేరును బీజేపీ నాయకత్వం ఆదివారం నాడు ప్రకటించింది.ఈ ఏడాది జూన్ 12న ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.
హుజూరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం (huzurabad bypoll)నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender)ను బీజేపీ (bjp)తన అభ్యర్ధిగా ప్రకటించింది.ఈ నెల 30వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ (gellu srinivas yadav), కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరు వెంకట్ (balmuri venkat)లను ఆ పార్టీలు ప్రకటించాయి. బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పేరును బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం నాడు ప్రకటించింది.
ఈ ఏడాది జూన్ 12వ తేదీన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. జూన్ 14వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అసైన్డ్ భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను కేసీఆర్ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారు. దీంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2009 నుండి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ వరుసగా విజయాలు సాధించారు. అంతకుముందు ఆయన కమలాపూర్ నుండి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.తొలిసారిగా హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నారు.