తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్... టీఆర్ఎస్ లోకి మల్లన్న టీం సభ్యులు భూమయ్య

By Arun Kumar PFirst Published Oct 3, 2021, 11:50 AM IST
Highlights

ప్రస్తుతం జైల్లో వున్న తీన్మార్ మల్లన్నకు మరో షాక్ తగిలింది. ఆయనకు సన్నిహితుడు, రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 

కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని క్యూన్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విరుచుకుపడే తీన్మార్ మల్లన్న ప్రస్తుతం జైళ్లో వున్న విషయం తెలిసిందే. తాజాగా అతడికి మరో షాకిచ్చింది టీఆర్ఎస్.  మల్లన్నకు సన్నహితుడు, కమిటీ రాష్ట్ర కన్వీనర్‌‌ దాసరి భూమయ్య ఆర్థిక మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తీన్మార్ మల్లన్న కమిటీ సభ్యులు భూమయ్య.   రాజేందర్ తో పాటు మరో వంద మంది టిఆర్ఎస్ లో చేరారు.

 తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరనున్నట్టు ఆయన సతీమణి మమత ప్రకటించారు. అంతేకాదు, మల్లన్నను విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆమె మెయిల్ చేసినట్టు తెలిసింది. దీంతో ఇంతకాలం మల్లన్నతో వున్న భూమయ్యతో పాటు ఇతర కమిటీ సభ్యులు తమదారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భూమయ్య, జున్నోతు రాజేందర్ టీఆర్ఎస్ లో చేరారు.   

ఓ జ్యోతిష్యుడి ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యారంటూ తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు నుంచి బెయిల్ వచ్చినా మరో కేసులో ఇంకా రిమాండ్‌లోనే ఉన్నారు. 

READ MORE  Huzurabad Bypoll : ‘సొంత వాహనం కూడా లేదు’.. అఫిడవిట్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్..

టీఆర్ఎస్‌పై కటువైన విమర్శలు, ఆరోపణలు చేస్తూ అప్పటికే జర్నలిస్టుగా పేరున్న ఆయన మరింత ఆదరణ సంపాదించుకున్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు టీఆర్ఎస్‌పై విమర్శలు, ఇటు రాజకీయంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు సమాంతరంగా కొనసాగించారు.

టీఆర్ఎస్‌పై పదునైన విమర్శలతో ప్రాచుర్యం పొందిన ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రతిపక్షపార్టీలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రయత్నాలు చేశాయి. కానీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కీలక నాయకులు వివేక్, అర్వింద్ సహా పలువురు నేతలు అరెస్టయిన మల్లన్నవైపు నిలబడ్డారు. అంతేకాదు బీజేపీలో చేరితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనున్నట్టు గతంలో ఆయనతో ఓ ప్రతిపాదన చేసినట్టు గుసగుసలు వినిపించాయి. చివరకు బిజెపిలో చేరడానికి తీన్మార్ మల్లన్న సిద్దమైనట్లు ఆయన భార్య మమత ప్రకటించారు.  

click me!