బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకే నాణానికి రెండు ముఖాలు.. : రేవంత్‌రెడ్డి

By Mahesh Rajamoni  |  First Published Aug 21, 2023, 6:01 AM IST

Hyderabad: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) రెండు పార్టీలు ఒక్క‌టేన‌నీ,  అవి ఒకే నాణానికి రెండు ముఖాలు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఏ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ తన స్నేహితుల కోసం, సీఎం కేసీఆర్ తన కుటుంబం కోసం రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
 


TPCC President A Revanth Reddy: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) రెండు పార్టీలు ఒక్క‌టేన‌నీ,  అవి ఒకే నాణానికి రెండు ముఖాలు అని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఏ. రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ తన స్నేహితుల కోసం, సీఎం కేసీఆర్ తన కుటుంబం కోసం రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

వివ‌రాల్లోకెళ్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాల‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లు ఒక్క‌టేన‌ని ఆరోపించారు. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ తన స్నేహితుల కోసం దోచుకుంటున్నార‌ని ఆరోపించారు. ఇదే స‌మ‌యంలో ,రాష్ట్ర ముఖ్య‌మంత్రి  కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) తన కుటుంబం కోసం రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

Latest Videos

బీఆర్‌ఎస్‌, బీజేపీలు కవలలని సమర్థిస్తున్నాయనీ, అవి ఒకే నాణానికి రెండు ముఖాలవంటివని విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్‌ పోరాడిందనీ, బ్రిటిష్‌ పాలకుల మాదిరిగా విభజించు పాలించు విధానాన్ని అమలు చేసిన చరిత్ర బీజేపీకి ఉందంటూ మండిప‌డ్డారు. మణిపూర్ ఘటనే అందుకు నిదర్శనమ‌ని అన్నారు.

అసెంబ్లీలో మణిపూర్ అంశంపై బీఆర్ఎస్ కనీసం మాట్లాడలేదని విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కాంగ్రెస్‌ను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అలాగే, మణిపూర్ హింసపై మౌనంగా ఉన్నందుకు ప్రధాని మోడీపై కూడా ఆయన మండిపడ్డారు. ఐటీ, టెలికాం విప్లవం వెనుక రాజీవ్ గాంధీ ఉన్నారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో సాంకేతికతలో మంచి ఫలితాలను ఇచ్చాయ‌ని పేర్కొన్నారు.

అంత‌కుముందు కూడా బీజేపీ రేవంత్ రేడ్డి ఘాటు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కేసీఆర్ కు ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనని విమర్శించారు. పౌరసత్వ సవరణ, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, 2022 రాష్ట్రపతి ఎన్నికల వంటి అంశాల్లో పార్లమెంటులో కేసీఆర్ మోడీ ప్రభుత్వానికి మద్దతిచ్చారని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ కు ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనని అన్నారు.

click me!