తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద మళ్లీ ‘‘సాలు దొర’’ స్క్రీన్

By Siva KodatiFirst Published Aug 16, 2022, 8:19 PM IST
Highlights

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తుంది. తాజాగా మరోసారి కేసీఆర్‌కు వ్యతిరేకంగా ‘‘సాలు దొర - సెలవు దొర’’ డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసింది బీజేపీ.

తెలంగాణ బీజేపీ (bjp) కార్యాలయం ఎంట్రన్స్‌లో మరోసారి డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు నేతలు. సాలు దొర - సెలవు దొర పేరుతో కార్యాలయం బయటి గోడపై స్క్రీన్ ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే ఇది వరకే పోలీసులు, జీహెచ్ఎంసీ అభ్యంతరం తెలపడంతో స్క్రీన్‌ను తొలగించారు బీజేపీ నేతలు. అయితే కొద్దిరోజుల గ్యాప్‌లోనే మళ్లీ డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసింది బీజేపీ. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెబుతున్నారు బీజేపీ నేతలు.

కాగా.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తుంది. కేసీఆర్‌కు (kcr) వ్యతిరేకంగా ‘‘సాలు దొర - సెలవు దొర’’ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద సాలు దొర- సెలవు దొర అంటూ డిజటల్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. ఈ పేరు మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. 

Also Read:తెలంగాణ బీజేపీకి ఈసీ షాక్.. సాలు దొర - సెలవు దొర ప్రచారంపై అభ్యంతరం..

అయితే ‘‘సాలు దొర - సెలవు దొర’’ప్రచారానికి అనుమతి  కోరుతూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు. అయితే దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. బీజేపీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని బీజేపీని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఎం బొమ్మతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని పేర్కొంది.

click me!