Hyderabad Floods: వరదల మహత్మ్యం.. బిర్యానీ సెల్ఫ్ డెలివరీ..!

Published : Aug 01, 2022, 09:52 AM ISTUpdated : Aug 01, 2022, 09:57 AM IST
Hyderabad Floods: వరదల మహత్మ్యం.. బిర్యానీ సెల్ఫ్ డెలివరీ..!

సారాంశం

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. ఓ వీడియోలో.. బిర్యానీ వండటానికి ఉపయోగించే భారీ గిన్నెలు.. ఆ వరద నీటిలో తేలుకుంటూ రావడం గమనార్హం.  

ప్రస్తుత కాలంలో ఫుడ్ డెలివరీ యాప్ లు కుప్పలు తెప్పలుగా మన ముందకు వచ్చేశాయి. మనకు కావాలి అనుకున్నప్పుడు ఫుడ్ డెలివరీ చేసుకుంటూ ఉంటాం. అయితే.. ఆ ఫుడ్ ని ఎవరో ఒకరు డెలివరీ చేయాలి. కానీ.. ఇటీవల హైదరాబాద్ లో డెలివరీ బాయ్ లేకుండా బిర్యానీ దానంతట అదే డెలివరీ అయితే.. ఇలా జరగాలంటే మరింత టెక్నాలజీ కావాలి అని అనుకుంటున్నారా..? కేవలం వర్షాలకు కురిసిన వరదలకు ఇది జరిగితే. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు భారీగా పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వరదలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. ఓ వీడియోలో.. బిర్యానీ వండటానికి ఉపయోగించే భారీ గిన్నెలు.. ఆ వరద నీటిలో తేలుకుంటూ రావడం గమనార్హం.

 

దీనిని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. హైదరాబాద్‌లోని నవాబ్ సాహెబ్ కుంటలోని 'అదిబా హోటల్' వద్ద ఈ వీడియోని తీయడం విశేషం. రెస్టారెంట్ వద్ద కు వచ్చిన వరద నీటిలో.. బిర్యానీ కుండ తేలుకుంటూ రావడం విశేషం.

కాగా. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది. పాపం ఎవరో ఆర్డర్ చేసుకున్న బిర్యానీ ఇలా నీళ్లలో వెళ్తోందని కొందరు కామెంట్ చేయగా.. డెలివరీ బాయ్ లేకుండా.. ఫ్రీగా బిర్యానీ డెలివరీ అవుతోందంటూ మరి కొందరు కామెంట్ చేయడం గమనార్హం. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ వీడియో చూస్తుంటే.. నగరంలో వరద తీవ్రత ఎంతలా ఉందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే