బర్త్ డే కేక్ కట్ చేసి జైలుపాలైన హైదరాబాదీ

Published : Sep 08, 2017, 10:46 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
బర్త్ డే కేక్ కట్ చేసి జైలుపాలైన హైదరాబాదీ

సారాంశం

వినూత్నంగా బర్త్ డే జరిపిన ఉప్పల్ వాసి భారీ కత్తితో కేక్ కట్ చేసిన భరత్ గౌడ్ అక్రమ ఆయుధాలు కలిగిన నేరం కింద అరెస్టు

హైదరాబాద్ లోని ఒక యువకుడు బర్డ్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకున్నాడు. దోస్తులంతా వచ్చి ధూం ధాం గా ఎంజాయ్ చేసిర్రు. కానీ వెంటనే బర్త్ డే బాయ్ జైలుపాలైండు. కాణమేందంటే ఆ బర్త్ డే వేడుకల్లో కేక్ కట్ చేయడమేనట. అదేంటి? బర్త్ డే కేక్ కట్ చేస్తే జైలుకు పోవుడేంది అని డౌట్ వస్తుందా? అయితే ఈ స్టోరీ చదవండి.

హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్మారెడ్డి కాలనిలో సెప్టెంబర్2 న బింగి భరత్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వెరైటీగా వేడుకలు జరపాలన్న ఉద్దేశంతో భరత్ గౌడ్ వయసున్న 32 కిలోల కేక్ తెచ్చారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ కేక్ కట్ చేసేందుకు పెద్ద తల్వార్ తెచ్చిర్రు. ఆ పెద్ద తల్వార్ తోటి కేక్ కట్ చేశాడు భరత్ గౌడ్.

ఆ సమయంలో పెద్ద తల్వార్ తో కేక్ కట్ చేసిన ఫొటోలు తీసి అకక్కడున్న జనాలు కొందరు రాచకొండ కమిషనర్ కు పంపించారు. దీంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఎస్ఓటి పోలీసులు బింగి భరత్ గౌడ్ అతనికి సహకరించిన పంగ రాజేశ్వర్ రెడ్డి లను అరెస్టు చేశారు.

ఈ సంఘటనలో భరత్ కు సహకరించిన శివ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అరెస్టు చేసిన వీరిద్దరిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. శివ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఉప్పల్ పోలీసులు ఆర్మ్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!