రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు: సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

By narsimha lodeFirst Published Aug 22, 2022, 8:00 PM IST
Highlights

తనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవమానిస్తున్నందున అతనితో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. 

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి  సోమవారం నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ప్రియాంకా గాంధీతో ఇవాళ న్యూఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశానికి గైర్హాజర్ కావడంపై ఆయన ఆ లేఖలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు.

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక విషయమై ఇవాళ పార్టీ అధినాయకత్వం సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో ప్రియాంకా గాంధీతో పాటు మాణికం ఠాగూర్, కేసీ వేణుగోపాల్ సహా తతిరులు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలు ఢిల్లీకి వచ్చారు. ఇవాళ ఉదయాన్నే హైద్రాబాద్ నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి వచ్చారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు బయలుదేరి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో తెలంగాణ నేతల సమావేశం జరగడానికి కొద్దిసేపటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  హైద్రాబాద్ కు బయలుదేరి వెళ్లారు. 

also read:మునుగోడుపై కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా , అప్పటిదాకా ఢిల్లీలోనే

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నందున అతనితో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.ఈ కారణంగాన తాను ఇవాాళ జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా చెప్పారు. చండూరులో జరిగిన సభలో తనను అమానించేలా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాదు తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధికి చెందిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకొనే విషయమై కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. చండూరులో కాంగ్రెస్ సభ విషయమై కూడా తనకు సమాచారం లేని విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబాన్ని కించపర్చేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 4న రాజీనామా చేశారు. అంతకు రెండు రోజుల ముందే తాను కాంగ్రెస్ పార్టీకి  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన రోజునే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాప్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కల్గించాయని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మాత్రమే వ్యాఖ్యలు చేశానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. చండూరులో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలను కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పు బట్టారు. హోంగార్డుులు, ఐపీఎస్ అధికారులంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ లు కూడా క్షమాపణలు చెప్పారు. 

click me!