ఇందిరలాగే ప్రియాంక కూడా మెదక్ నుంచి పోటీ చేయాలి : వీహెచ్ కొత్త డిమాండ్

By Siva KodatiFirst Published Aug 22, 2022, 7:02 PM IST
Highlights

ఇందిరా గాంధీ మాదిరే ప్రియాంక గాంధీ కూడా మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు. 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర.. మెదక్ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. 
 

టీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీని తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆయన కోరారు. గతంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిచారని వీహెచ్ గుర్తుచేశారు. 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర.. మెదక్ నుంచి గెలిచారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం వీహెచ్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై నేతలను పిలిచి అధిష్టానం మాట్లాడాలన్నారు . మర్రి శశిధర్ రెడ్డి తన ఆవేదన చెప్పారని.. దానిని అధిష్టానం సరిదిద్దాలని ఆయన హితవు పలికారు. సమావేశాలు పెట్టకపోవడం వల్లే నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్ టైమ్ ఇవ్వడం లేదని హనుమంతరావు ఆరోపించారు. 

ALso Read:బాధలు చెప్పుకోవడానికి వేదికేది.. అందుకే ఇలా రోడ్డెక్కుతున్నారు : కాంగ్రెస్‌లో అసమ్మతిపై తేల్చేసిన వీహెచ్

తనను కూడా గతంలో తిట్టారని, అవమానించారని కానీ పెద్దమనసుతో క్షమించానని ఆయన గుర్తు చేశారు. సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇస్తే అక్కడ మాట్లాడొచ్చన్నారు. మీటింగ్‌లు పెట్టకపోతే బయటే మాట్లాడతారని వీహెచ్ హెచ్చరించారు. అసదుద్దీన్ కానీ, అక్బరుద్దీన్ కానీ తనను ఒక్క మాట కూడా అనలేదని.. అయితే సొంతపార్టీలోనే కొందరు తనను తిడుతున్నారని వీ హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు మేం మేం కొట్టుకుంటే బాగోదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గంలోనే మునుగోడు వుందని.. అందువల్ల ఆయన అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. 
 

click me!