కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రెండోసారి షోకాజ్ నోటీసును పంపింది.
హైదరాబాద్:భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. ఈ సమాధానంపై ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ నెల 4వ తేదీన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రెండోసారి షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 22న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అయితే ఈ షోకాజ్ అందలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యాలయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వడంతో ఈ నెల 4 వ తేదీన మరో షోకాజ్ నోటీసును జారీ చేసింది ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం.
మునుగోడు ఉప ఎన్నికను పురస్కరించుకొని బీజేపీకి ఓటు చేయాలని ఓ కార్యకర్తతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసినట్టుగా ఓ ఆడియో వెలుగు చూసింది. అంతేకాదు అస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధించదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యల విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ దృష్టికి తీసుకువెళ్లారు. మాణికం ఠాగూర్ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి నివేదించారు. దీంతో ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మెన్ తారిఖ్ అన్వర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి గత నెల 22న షోకాజ్ నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఈ నెల 4 వ తేదీన మరో నోటీసును పంపారు. ఈ నోటీసుకు రెండు రోజుల క్రితమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిప్లై ఇచ్చారు. షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
also read:మొదటి షోకాజ్‌కి నో రిప్లయ్: మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసు
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విషయమై సీరియస్ గా ఉంది. లక్షణ రేఖ ఎవరూ దాటినా కూడా వారిపై చర్యలు తప్పవని మాజీ కేంద్ర మత్రి జైరాం రమేష్ తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో గుర్తు చేశారు.