షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయి: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By narsimha lodeFirst Published Jan 12, 2023, 11:03 AM IST
Highlights

ఎఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ షోకాజ్ నోటీసు చెత్తబుట్టలో పడిందన్నారు.
 

హైదరాబాద్: ఎఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్లబుట్టలో  పడ్డాయని   భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.గురువారం నాడు  హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రేతో  ఆయన  భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులపై ఆయన  చర్చించారు. అనంతరం  మీడియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.షోకాజ్  నోటీస్ అనేది లేనే లేదన్నారు నిన్న బిజీగా ఉన్నందునే  గాంధీ భవన్ కు రాలేదన్నారు.  గాంధీభవన్ కు ఇతర నేతలు  కూడా రాలేదని ఆయ న చెప్పారు. జగ్గారెడ్డి, పొడెం వీరయ్య, సీతక్కలు కూడా నిన్న గాంధీభవన్ కు రాలేదని ఆయన గుర్తు చేశారు. వాళ్లంతా గాంధీ భవన్ కు ఎందుకు  రాలేదని  అడగరని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాను ప్రశ్నించారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.నాలుగైదు సార్లు  ఓటమిపాలైనవారితో తాను  కూర్చోవాలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

ఎన్నికలు వస్తున్నందున ప్రజల్లోకి యుద్ధం చేయాలన్నారు.ఈ విషయమై  ఠాక్రే కొన్ని సలహాలు చెప్పారన్నారు. తాను కూడా  కొన్ని అంశాలను మాణిక్ రావుకు  చెప్పినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన గురించి ఠాక్రేకు తెలుసునన్నారు. ఠాక్రే గురించి కూడా  తనకు తెలుసుని చెప్పారు.  మాణిక్ రావు ఠాక్రే మంచి వ్యక్తి అని  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  తెలిపారు. మొన్న రాత్రి  ఠాక్రే తనకు ఫోన్ చేశారని వెంకట్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తన నియోజకవర్గంలో  పనుల నేపథ్యంలో తాను  నిన్న  రాని విషయాన్ని  ఠాక్రే దృష్టికి తీసుకెళ్లినట్టుగా  వెంకట్ రెడ్డి  చెప్పారు.  గతంలో పార్టీ సీనియర్లను కించపరుస్తూ   సోషల్ మీడియాలో  పోస్టింగ్ లు పెట్టారని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.ఈ విషయమై  ఉత్తమ్ కుమార్ రెడ్డి  కూడా ఫిర్యాదు చేశారన్నారు. తాను కూడా  ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.

also read:మాణిక్ రావు ఠాక్రేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ: పార్టీ పరిస్థితులపై చర్చ

2022 నవంబర్  4వ తేదీన  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసు జారీ చేసింది. అంతకు ముందు  10 రోజుల ముందు  కూడ షోకాజ్ నోటీసు ఇచ్చింది.  మొదటి సారి ఇచ్చిన షోకాజ్ నోటీసు అందలేదని వెంకట్ రెడ్డికి చెందిన కార్యాలయం సమాచారం ఇవ్వడంతో  మరోసారి  ఆయన కు  నవంబర్ 4వ తేదీన నోటీసును అందించింది. ఈ నోటీసుకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సమాధానం పంపారు.  
మునుగోడు ఉప ఎన్నికల సమంలో  తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు  ఫోన్ చేసినట్టుగా  ఉన్న ఆడియో వైరల్ గా మారింది.  మరో వైపు అస్ట్రేలియా పర్యటనలో   ఉన్న సమయంలో  చేసిన వ్యాఖ్యలు కూడా  కలకలం రేపాయి. మునుగోడులో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని  వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా  వీడియో వైరల్ గా మారింది.ఈ పరిణామాలపై  అప్పటి  కాంగ్రెస్ రాస్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఎఐసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు.దీంతో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.  
 

click me!