మాణిక్ రావు ఠాక్రేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ: పార్టీ పరిస్థితులపై చర్చ

తెలంగాణ కాంగ్రెస్  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రేతో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. 


హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు  ఠాక్రేతో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  గురువారం నాడు సమావేశమయ్యారు..  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ పదవి నుండి  మాణిక్కం ఠాగూర్ ను పార్టీ జాతీయ నాయకత్వం తప్పించింది.   తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యహరాల ఇంచార్జీగా  నియామాకమైన తర్వాత  మాణిక్ రావు  ఠాక్రే  నిన్న  హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత  ఠాక్రే పార్టీ నేతలతో  వరుస భేటీలు  నిర్వహిస్తున్నారు.  నిన్న అర్ధరాత్రి వరకు   కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో  ఠాక్రే సమావేశాలు నిర్వహించారు. ఇవాళ కూడా   పార్టీ నేతలతో  ఠాక్రే సమావేశాలు నిర్వహించనున్నారు. 

హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో  ఉన్న  ఠాక్రేతో   భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు.గంటన్నరపాటు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఠాక్రేతో భేటీ అయ్యారు.  రాష్ట్రంలో  పార్టీ పరిస్థితులపై చర్చించారు. గత ఏడాది చివర్లో ప్రకటించిన పార్ీ కమిటీలపై  కూడా  చర్చించినట్టుగా సమాచారం. పార్టీలో మొదటి నుండి  ఉన్నవారికి  కమిటీల్లో ప్రాధాన్యత దక్కని  విషయమై  ఠాక్రే దృష్టికి తీసుకు వచ్చినట్టుగా సమాచారం.  
 మునుగోడు  ఉప ఎన్నికల  సమయంలో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని  చేసిన వ్యాఖ్యలపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం  షోకాజ్  నోటీసులు జారీ చేఇంది.ఈ నోటీసులకు  కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం పంపారు.ఈ షోకాజ్ నోటీసుపై   కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

Latest Videos

గత ఏడాది  డిసెంబర్ మాసంలో  కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.  రాష్ట్ర పర్యటనకు  వచ్చే ముందు  గాంధఈ భవన్ కు రావాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఠాక్రే ఫోన్ చేశారు. అయితే తాను గాంధీ భవన్ కు రానని వెంకట్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. దీంతో హైదర్ గూడలో  ఉన్న  ఠాక్రేతో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సమావేశంమయ్యారు.ఖర్గేతో భేటీ అయిన మరునాడే  ప్రధాని మోడీతో కూడా  వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. తన  నియోజకవర్గంలో  అభివృద్దికి సంబంధించిన  నిధుల విడుదల విషయమై  మోడీతో చర్చించినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

గత ఏడాది  చివర్లో  కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన  పార్టీ కమిటీల విషయమై సీనియర్లు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్, వలసవాదులుగా  పార్టీ నేతలు చీలిపోయిన  పరిస్థితి నెలకొంది.  కాంగ్రెస్ సీనియర్లు తమను తాము ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా ప్రకటించుకున్నారు.  ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్లకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతు ప్రకటించారు. సీనియర్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి తన మద్దతు ఉంటుందని  కూడా వెంకట్ రెడ్డి ప్రకటించారు. 
 

click me!