రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం తర్వాతే నేను: పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి

By narsimha lode  |  First Published Aug 4, 2022, 12:27 PM IST


బీజేపీ తెలంగాణ చీప్ బండి సంజయ్ తో తాను ఏనాడూ కూడా టచ్ లో లేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తనపై బండి సంజయ్ ఏం చేశారో చూడకుండా తాను ఈ విషయమై వ్యాఖ్యలు చేయబోనన్నారు. 



తాను కూడా BJP కి అనుకూలంగా ఉన్నానని  బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  Bhuvanagiri MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇవాళ భువనగిరి జిల్లాలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.  ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.

 న్యూఢిల్లీలో ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. బండి సంజయ్ ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. బండి సంజయ్ తో తాను టచ్ లో లేనని చెప్పారు. బండి సంజయ్ మాట్లాడిన విషయాలను తాను చూడలేదన్నారు బండి సంజయ్ ఏమి మాట్లాడారో చూడకుండానే తాను ఏమి మాట్లాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

Latest Videos

undefined

 బండి సంజయ్ తోనే కాదు బీజేపీకి చెందిన ఎవరితోనూ కూడా తాను టచ్ లో లేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు.  ప్రధాని మోడీని కలిసిన  ఉద్దేశ్యం గురించి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన నియోజకవర్గంలో జాతీయ రహదారుల అంశంతో పాటు బొగ్గు గనుల టెండర్ల విషయంలో చోటు చేసుకొన్న అవినీతి విషయంలో  ప్రధానిని కలిసినట్టుగా చెప్పారు.మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పారు.

Munugode MLA పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయలేదన్నారు. ఈ రాజీనామా స్పీకర్  ఆమోదించిన తర్వాత ఏం చేయాలో తాను తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయలేదన్నారు. ఇప్పుడే ఈ ప్రశ్న వేయడం తప్పన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ఏం చేయాలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

Also read:బీజేపీకి అనుకూలంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: బండి సంజయ్ సంచలనం

కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఎలాంటి విబేధాలు లేవన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో జరిగే పరిణామాలపై తాను దృష్టి కేంద్రీకరించినట్టుగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, తన నియోజకవర్గానికి నిధుల విషయమై తాను పోరాటం చేస్తున్నట్టుగా చెప్పారు.  తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాలను పాటిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజానామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తన సోదరుడు వెంకట్ రెడ్డి గురించి ఆయననే అడగాలని మీడియాకు చెప్పారు. బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారు. చాలా కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా కూడా రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుందన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదర్కొనే శక్తి బీజేపీకే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీ బలం పెరిగిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదహరిస్తున్నారు.
 

click me!