జగిత్యాల- కరీంనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

Published : Aug 04, 2022, 10:42 AM IST
జగిత్యాల- కరీంనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

సారాంశం

తెలంగాణలోని జగిత్యాల- కరీంనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 

తెలంగాణలోని జగిత్యాల- కరీంనగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కృష్ణ, బస్సులో ప్రయాణిస్తున్న ముత్తమ్మ (68) ఉన్నారు. బస్సు కరీంనగర్ వైపు నుంచి జగిత్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మల్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక  చర్యలు చేపట్టారు. 

గాయపడిన వారికి ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు. ఇక, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే