అస్ట్రేలియా నుండి హైద్రాబాద్‌కి కోమటిరెడ్డి: షోకాజ్ పై ఎలా స్పందిస్తారో?

By narsimha lodeFirst Published Nov 2, 2022, 10:01 AM IST
Highlights

అస్ట్రేలియా పర్యటనను ముగించుకొని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద్రాబాద్ కు చేరుకున్నారు. ఈ ఏడాది అక్టో బర్ 21నకోమటిరెడ్డి వెంకట్  రెడ్డి అస్ట్రేలియాకు వెళ్లారు.

హైదరాబాద్:అస్ట్రేలియా పర్యటనను ముగించుకొని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం  నాడు ఉదయం హైద్రాబాద్ కు వచ్చారు. మునుగోడు ఎన్నికల ప్రచారం  ముగిసిన తర్వాత  ఆయన  అస్ట్రేలియా  నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు. పార్టీ ఇచ్చిన షోకాజ్  నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి  నెలకొంది.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రేపటితో గడువు ముగియనుంది.  రేపటిలోపుగా ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది. మరో వైపు రాష్ట్రంలో రాహలు్ గాంధీ  పాదయాత్ర సాగుతుంది. ఈ  యాత్రలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొంటారా లేదా అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.క్లీన్ చిట్  వచ్చే వరకు తాను ఎవరినీ కలవబోనని వెంకట్ రెడ్డి చెబుతున్నారని సమాచారం.

ఈ ఏడాది అక్టోబర్ 21న భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్ట్రేలియాకు వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత  అద్దంకి దయాకర్ తనపై  చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  ఆయన ప్రకటించారు. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధిగా మునుగోడ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని తన అనుచరులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టుగా ఉన్నఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆడియో సంభాషణ  బయటకు వచ్చిన మరునాడే అస్ట్రేలియాలో టూర్ లో  కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదని వెంకట్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి .ఈ రెండు అంశాలను సీరియస్  గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  అయితే  ఈ షోకాజ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ రకమైన సమాధానం ఇస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని ఆ  పార్టీ  భావిస్తుంది. అయితే అదే సమయంలో భారత్  జోడో  యాత్ర కూడ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడంతో పార్టీ కీలక నేతలు జోడో యాత్రపై కేంద్రీకరించారు. 

also read:కోమటిరెడ్డికి ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు: 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

మునుగోడులో ఎన్నికల ప్రచారానికి రావాలని కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి వెంకట్ రెడ్డిని కోరారు. అయితే తన ఆశీర్వాదాలుంటాయని వెంకట్  రెడ్డి తనకు  హామీ ఇచ్చారని పాల్వాయి స్రవంతి మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే . అయితే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలౌతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై  ఆమె ఆవేదన వ్యక్తం  చేశారు. 
 

click me!