ఖైదీ సోదరిని జైలు అధికారి వేధింపులు.. వీడియోకాల్ చేస్తేనే పెరోల్ అంటూ ఒత్తిడి..

By SumaBala Bukka  |  First Published Nov 2, 2022, 7:16 AM IST

పెరోల్ తొందరగా రావాలంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ ఓ జైలు అధికారి.. ఖైదీ సోదరితో నీచానికి దిగజారాడు. ఆమె దీనిమీద ఫిర్యాదు చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. 


హైదరాబాద్ : పెరోల్ కాగితాలు ఉన్నతాధికారులకు పంపించి.. అనుమతి తొందరగా వచ్చేలా చూడాలి.. అంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ ఖైదీ సోదరిని జైలు అధికారి వేధింపులకు గురి చేసిన సంఘటన చర్లపల్లిలో వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎండి భాష అనే ఖైదీ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి పెరోల్ అవకాశం లభించింది.  అయితే, త్వరగా ప్రక్రియ పూర్తి కావాలంటే తనకు వీడియో కాల్ చేయాలంటూ డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథం ఖైదీ సోదరికి ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టాడు.  

దీని గురించి జైల్లో ఉన్న సోదరుడికి పెట్టుకుని ఆమె ఏడ్చింది. తన కుటుంబ సభ్యులను సదరు అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పర్యవేక్షణాధికారి సంతోష్ రాయ్ కి గత నెల26న ఖైదీ ఫిర్యాదు చేశాడు. వేధింపులు వాస్తవమేనని విచారణ అధికారి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యలలో భాగంగా ఆ అధికారిని బదిలీ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ జితేందర్ మంగళవారం  ఉత్తర్వులు జారీ చేశారు. అతడిపై జైళ్లశాఖ అధికారితో పాటు  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. 

Latest Videos

మునుగోడు బైపోల్ 2022: తూఫ్రాన్ ‌పేట వద్ద రూ. 90 లక్షలు సీజ్

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే అక్టోబర్ 26న కర్నాటకలో వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ అధికారి వరసకి మరదలు అయిన యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకుంది. చల్లకేరే పోలీస్ స్టేషన్ లో ఉమేష్ అనే వ్యక్తి  పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఆస్తి సమస్యను పరిష్కరించే ముసుగులో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఐదేళ్లుగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అని వాపోయింది.  

అంతేగాక, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ తన మేనమామ కుమారుడని, వరుసకు బావ అవుతాడు అని పేర్కొంది. ఉమేష్ ఐదేళ్ల క్రితం దావణగెరె పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ బాధితురాలు నిందితుడిని సంప్రదించింది. ఈ కేసులో సహాయం చేస్తున్నట్లు నటించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా పలు సందర్భాల్లో బాధితురాలిని బెదిరించి లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో యువతి ఐదుసార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. 

రమేష్ కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారని.. తన మూడో పెళ్లి చేసుకుంటానని అతను కోరుతున్నట్లు తెలిపింది. పెళ్లి చేసుకోకుంటే ఆస్తి తనకు దక్కకుండా చేస్తానని బెదిరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాక తన తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతానని, చెప్పినట్లు వినకుంటే చంపేస్తానని సైతం హెచ్చరిస్తున్నట్లు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై చిత్రదుర్గ మహిళా పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదైంది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. 

click me!