భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్: త్వరలోనే కలుద్దామన్న సీఎల్పీ నేత

By narsimha lode  |  First Published Dec 12, 2022, 5:07 PM IST

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సోమవారం నాడు ఫోన్ చేశారు.  త్వరలోనే కలుద్దామని  విక్రమార్క కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెప్పారు.


హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు  సోమవారంనాడు ఫోన్ చేశారు.   త్వరలో కలుద్దామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల క్రితం ప్రకటించిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్థానం కల్పించలేదు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కానుందని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు  ఈ ఎన్నికల సమయంలో  తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కోరినట్టుగా ఆడియో సంభాషణ వైరల్ గా మారింది.ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  షోకాజ్  నోటీసు జారీ చేసింది.  

ఈ షోకాజ్ నోటీసులకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సమాధానం పంపారు.ఈ సమాధానంపై  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఆగస్టు  4న కాంగ్రెస్ పార్టీకి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  రాజీనామా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగాడు. 

Latest Videos

undefined

ఈ విషయమై టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చండూరు సభలో  కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ తనపై  చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి చెందారు. ఈ విషయాలపై  కలత చెంది మునుగోడు ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కమిటీల్లో తనకు స్థానం కల్పించకపోవడంపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్ననే స్పందించారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  తనకు పార్టీ కార్యకర్తలే ముఖ్యమన్నారు. 

also read:పీసీసీ కమిటీల నియామకంపై అసంతృప్తి: సీఎల్పీ నేత భట్టి నివాసంలో నేతల భేటి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య గ్యాప్ కొనసాగుతుంది.  ఇదే సమయంలో  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయడం, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు  ఈ గ్యాప్ ను మరింత  పెంచాయి.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో  పాదయాత్ర సాగించిన సమయంలోనే  అస్ట్రేలియా పర్యటనను ముగించుకొని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద్రాబాద్ కు వచ్చారు.అయితే  ఈ యాత్రలో వెంకట్ రెడ్డి పాల్గొనలేదు. తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినందున రాహుల్ గాంధీ  యాత్రలో  తాను  పాల్గొనలేదని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వివరించారు.

click me!