ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్: మూడు రోజులు హస్తినలోనే మకాం

By narsimha lode  |  First Published Dec 12, 2022, 4:47 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్  సోమవారంనాడు  ఢిల్లీకి బయలుదేరారు.  మూడు రోజుల పాటు  సీఎం కేసీఆర్  న్యూఢిల్లీలోనే ఉంటారు. ఈ నెల 14న  న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారంనాడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ న్యూఢిల్లీలోనే ఉంటారు.  దేశ రాజధానిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ  ఈ ఏడాది అక్టోబర్  5వ తేదీన  పార్టీ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేసి ఈసీకి పంపింది.  టీఆర్ఎస్ పేరును  బీఆర్ఎస్ గా మారుస్తూ  ఈసీ కేసీఆర్ కు లేఖను పంపింది.ఈసీ పంపిన  లేఖపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల  9వ తేదీన మధ్యాహ్నం 1:20 గంటలకు  సంతకం పెట్టారు.ఈ  లేఖను ఈసీకి పంపారు.  

ఢిల్లీలో బీఆర్ఎస్ స్వంత భవన నిర్మాణాలు పనులు పూర్తి కావడానికి  ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సర్ధార్ పటేల్ రోడ్డులో  తాత్కాలిక భవనాన్ని పార్టీ కార్యాలయం కోసం అద్దెకు తీసుకున్నారు.ఈ నెల  14వ తేదీన  బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నెల  13, 14 తేదీల్లో బీఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్  నిర్వహించనున్నారు.

Latest Videos

also read:మరోసారి రాజశ్యామల యాగం:ఈ నెల 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో కేసీఆర్ యాగం

న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో  బీఆర్ఎస్ స్వంత కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి కావాలంటే  ఇంకా ఆరు మాసాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.  ఈ ఏడాది అక్టోబర్  11న బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని కేసీఆర్ పరిశీలించారు.  కొన్ని మార్పులు సూచించారు. అక్టోబర్  12న  వసంత్ విహార్ లో  స్వంత భవనం  నిర్మాణం పనులను కేసీఆర్ పరిశీలించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఇందులో భాగంగానే  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.  ఈ మేరకు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల సీఎంలు, నేతలను కేసీఆర్ కలుస్తున్నారు.  ఇక రానున్న రోజుల్లో  ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తరించే వ్యూహన్ని కేసీఆర్ అమలు చేయనున్నారు.  బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలసీని కేసీఆర్  త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 


 

click me!