తెలంగాణకు హోంమంత్రి ఉన్నాడా?: సాత్విక్ కేసులో పోలీసులపై కోమటిరెడ్డి ఫైర్

By narsimha lode  |  First Published Mar 2, 2023, 1:49 PM IST

నార్సింగి  శ్రీచైతన్య కాలేజీ స్టూడెంట్  సాత్విక్ సూసైడ్ లో  నిందితులకు వత్తాసు పలికేలా  పోలీసులు వ్యవహరిస్తున్నారని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.  
 



హైదరాబాద్: ఇంటర్ స్టూడెంట్  సాత్విక్  ఆత్మహత్య  ఘటన  రాష్ట్ర  ప్రజలను కంటతడి పెట్టిస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.గురువారంనాడు  నార్సింగి శ్రీచైతన్య కాలేజీకి  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వచ్చారు.  సాత్విక్  సూసైడ్  లేఖలో   పేర్కొన్న  వ్యక్తులను  అరెస్ట్  చేశారా అని  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  సీఐని ప్రశ్నించారు.  కాలేజీ యాజమాన్యానికి  వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి   సీఐపై ఆగ్రహం వ్యక్తం  చేశారు.   ప్రజా ప్రతినిధిగా  ఉన్న తనతో  మాట్లాడే తీరు ఇదేనా అంటూ  సీఐపై  ఎంపీ సీరియస్ అయ్యారు.

సూసైడ్ లెటర్ లో  సాత్విక్  ప్రస్తావించిన వేధింపులను  ఎంపీ  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  గుర్తు చేశారు. ఇలా వేధింపులకు గురి చేసిన  కాలేజీ సిబ్బందిపై  ఎందుకు  చర్యలు తీసుకోలేదని  ఆయన  పోలీసులను ప్రశ్నించారు.  నారాయణ, చైతన్య కాలేజీ యాజమాన్యాలకు  పోలీసులు అమ్మడుపోయారా అని  ఆయన అడిగారు.  ఏపీ రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో  కూడా విద్య రంగంపై  భారీగా నిధులను ఖర్చు పెడుతుందన్నారు. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలపై  ఏపీ సర్కార్  ఉక్కుపాదం  మోపుతున్న విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రస్తావించారు.  చిత్తూరులో  టెన్త్ క్లాస్  ప్రశ్నాపత్రం  లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను  ఏపీ పోలీసులు అరెస్ట్  చేసిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు  చేశారు.

Latest Videos

also read:సాత్విక్ కేసు: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు

తెలంగాణకు  హోం మంత్రి ఉన్నాడా అని  ప్రశ్నించారు.  మానవత్వం లేకుండా  వ్యవహరిచండాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుబట్టారు.  విద్యార్ధులను  ఇష్టారీతిలో  కొట్టిన కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు.  కాలేజీ మేనేజ్ మెంట్  తామే అనే రీతిలో  పోలీసులు వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఆరోపించారు. 

click me!