రైతులకు 10 గంటల విద్యుత్ ఇస్తే రాజీనామా: కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

By narsimha lode  |  First Published Jul 12, 2023, 2:28 PM IST

రైతులకు  ఉచితంగా  10 గంటలపాటు  ఉచితంగా విద్యుత్ ను  సరఫరా  చేసినట్టుగా నిరూపిస్తే  రాజీనామా చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.


హైదరాబాద్:రైతులకు  ఉచితంగా  10 గంటల పాటు నిరంతరాయంగా  సరఫరా చేసినట్టుగా నిరూపిస్తే  తాను రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.బుధవారంనాడు  హైద్రాబాద్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల లేదా నల్గొండ నియోజకవర్గంలోని ఏదో ఒక సబ్ స్టేషన్ కు వెళ్దామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.  

10 గంటల కంటే ఎక్కువ సేపు నిరంతరాయంగా  విద్యుత్ ను సరఫరా చేసినట్టు నిరూపిస్తే  తాను  రాజీనామా చేస్తానన్నారు.  విద్యుత్ సబ్ స్టేషన్లలో  లాగ్ బుక్,  కంప్యూటర్లను పరిశీలిస్తే  ఎన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారో తేలుతుందన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ను  సరఫరా చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.రైతులకు 24 గంటల పాటు  త్రీఫేజ్ విద్యుత్ ను సరఫరా చేస్తామన్నారు.

Latest Videos

also read:ఉచిత విద్యుత్ పై రేవంత్ ప్రకటనతో రైతు డిక్లరేషన్ బోగస్సే: విద్యుత్ సౌధ వద్ద కవిత ఆందోళన

ఉచిత విద్యుత్ పై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తానా వేదికగా  చేసిన వ్యాఖ్యలు  తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు  సృష్టిస్తున్నాయి.  రైతులకు  ఉచిత విద్యుత్ మూడు గంటలు సరిపోతుందని వ్యాఖ్యలు  చేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతుంది. నిన్న, రేపు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. ఉచిత విద్యుత్ పై  బీఆర్ఎస్ తీరుపై  కాంగ్రెస్ పార్టీ కూడ ఇవాళ  పోటీ నిరసనలకు దిగింది.  

ఉచిత విద్యుత్ విషయమై  కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం  సాగుతుంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని  రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.  మరో వైపు  ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు  చేశారు.ధరణి రద్దుతో  రైతులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ఉచిత విద్యుత్ ను  సరఫరాను ఎత్తివేసే  ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉందని  బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

click me!