ప్రధాని మోదీని కలిసిన మందకృష్ణ మాదిగ..

Published : Jul 12, 2023, 02:21 PM IST
ప్రధాని మోదీని కలిసిన మందకృష్ణ మాదిగ..

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కలిశారు. ఇటీవల ప్రధాని మోదీ  తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కలిశారు. ఇటీవల ప్రధాని మోదీ  తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తాజాగా ఇందుకు సంబంధించి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని మోదీని కలిసిన  సందర్భంగా షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వర్గీకరణ గురించి ప్రధాని మోదీ వద్ద మందకృష్ణ మాదిగ ప్రస్తావించినట్టుగా తెలిసింది. 

తెలంగాణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికీ ప్రధాని మోదీ వరంగల్‌కు వచ్చిన సమయంలో ప్రత్యేక సమయము తీసుకొని ప్రధాని మోదీని కలిసినట్టుగా మందకృష్ణ మాదిగ చెప్పారు. ఈ సందర్బంగా మోడీ తనను ఎంతో ప్రేమతో హత్తుకొని ఆత్మీయంగా పలకరించారని చెప్పారు. ఈ భేటీలో ప్రధాని మోదీ వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత అంశం మీద చర్చించడం జరిగిందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్