భువనగిరిలో దళిత బంధు ఇస్తే.. ఇప్పుడే రాజీనామా , మళ్లీ పోటీ చేయను: కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్

Siva Kodati |  
Published : Aug 08, 2021, 07:28 PM IST
భువనగిరిలో దళిత బంధు ఇస్తే.. ఇప్పుడే రాజీనామా , మళ్లీ పోటీ చేయను: కేసీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్

సారాంశం

వాసాలమర్రిలో ఇచ్చినట్లు భువనగిరిలో దళిత బంధు ఇస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాసాలమర్రిలో ఇచ్చినట్లు భువనగిరిలో దళిత బంధు ఇస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే బాంబ్ కూడా రాసిస్తానని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో జరిగిన కాంగ్రెస్ సర్వ సభ్య సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యమని.. తర్వాతే పదవులని చెప్పారు. 

Also Read:కాంగ్రెస్ పటిష్టతే లక్ష్యం.. రేవంత్ రెడ్డితో విభేదాలు లేవు : తేల్చిచెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 1350 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక తెలంగాణలో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్కారుకు ఈ సందర్భంగా విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ అంటేనే ఎవరూ ముందుకు రావడం లేదంటూ చెప్పుకొచ్చారు భువనగిరి ఎంపీ.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?