కేసీఆర్ కు, మీకు మాచ్ ఫిక్స్ంగ్ జరిగిందా?.. మోడీకి భట్టి బహిరంగ లేఖ..

By SumaBala Bukka  |  First Published Apr 7, 2023, 12:33 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ఇందులో పలు ప్రశ్నలు సంధించారు. 


మంచిర్యాల : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో  పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. 30 ప్రశ్నలతో కూడిన లేఖను బట్టి విక్రమార్క మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో అనేక కీలక విషయాల మీద ప్రశ్నలు సంధించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి…
 
ప్రధాని మోడీ గారికి  మీ తోమ్మిదేళ్ల పాలనలో..

- రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టులు,  పథకాలు ఏమిటి?
- బయ్యారం ఉక్కు పరిశ్రమలు,  కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయి?
- కాలేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ ఎందుకు జరపడం లేదు?
- కేసిఆర్ కు మీకు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటి? 
- కేంద్ర మంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు నిర్వహించిన సమయంలో జరిగిన ఈఎస్ఐ కుంభకోణం సహారా కుంభకోణాలపై మౌనం ఎందుకు?
- తాజాగా కెసిఆర్ కుటుంబానికి సంబంధం ఉందని తేలిన మద్యం  లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో పురోగతి అక్కడే ఆగిపోయింది ఎందుకు?
- కెసిఆర్ కు మీకు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా?
-  గిరిజన యూనివర్సిటీ మాటేమిటి?
- విభజన హామీలను అమలు చేయడం లేదు ఎందుకు? 
అని పలు రకాల ప్రశ్నలను  ఈ లేఖలో మోదీకి భట్టి సంధించారు.

Latest Videos

తెలంగాణ ప‌ర్య‌ట‌కు ప్ర‌ధాని మోడీ.. పూర్తి షెడ్యూల్ వివ‌రాలు ఇవిగో

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. బట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు,  ప్రజల నుంచి మద్దతు పలుకుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. 

click me!