G.O. 317 పై స్ప‌ష్ట‌త ఇవ్వండి: సీఎల్పీ నేత భ‌ట్టి

Published : Dec 16, 2021, 07:52 PM IST
G.O. 317  పై స్ప‌ష్ట‌త ఇవ్వండి: సీఎల్పీ నేత భ‌ట్టి

సారాంశం

తెలంగాణ  స‌ర్కార్ అమ‌లు చేస్తున్న జీవో నెం 317 పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఈ జీవోను వెంట‌నే  సవరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు విజ్క్ష‌ప్తి చేస్తున్నాయి.  ఈ క్ర‌మంలో తెలంగాణలో ఉద్యోగులు, టీచర్లకు విప‌క్ష‌నేత‌లు మ‌ద్దతు ప‌లుకుతున్నారు. ఈ క్ర‌మంలో సీఎల్పీ నేత భ‌ట్టి స్పందించారు. టీచర్ల బదిలీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని అన్నారు. ఉద్యోగ‌, టీచర్ల బదిలీలు హేతుబద్దంగా లేదని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు  

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 317 పై నిర‌స‌న గ‌ళాలు పెరుగుతున్నాయి. ఈ జీవోను వెంట‌నే  సవరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు విజ్క్ష‌ప్తి చేస్తున్నాయి.  ఈ క్ర‌మంలో తెలంగాణలో ఉద్యోగులు, టీచర్లకు విప‌క్ష‌నేత‌లు మ‌ద్దతు ప‌లుకుతున్నారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల‌ని,  రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. న్యాయంగా వారికి రావాల్సిన ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. జీవో 317తో టీచర్ల స్థానికతకే ప్రమాదం ఏర్ప‌డుతోంద‌ని మండిప‌డుతున్నాయి. స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని,  జనాభా ప్రకారం ఏ జిల్లాలోనైనా తక్కువ పోస్టులుంటే, ఇతర జిల్లాల్లోని  ఖాళీలను ఆ జిల్లాలకు కేటాయించాలని లేదా సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇలా చేయ‌డం సాధ్యం కాకపోతే.,. కొత్తవారిని రిక్రూట్ చేయాలని చెప్పారు. ఇప్పటికైనా జీవో 317ను వెనక్కి తీసుకొని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పరిష్కారం చూపాలని అంటున్నాయి. 

Read Also: ఏపీ: 24 గంటల్లో 148 మందికి కరోనా.. చిత్తూరులో అత్యధికం

ఈ క్ర‌మంలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క స్పందించారు. టీచర్ల బదిలీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని అన్నారు. ఉద్యోగ‌, టీచర్ల బదిలీలు హేతుబద్దంగా లేదని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ‌. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు. ఇప్ప‌డిప్పుడే.. కరోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నార‌నీ, ఈ క్ర‌మంలో బ‌దిలీల పేరుతో వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నార‌ని అన్నారు. 

ప్రభుత్వ జీవో 317పై స్పష్టత లేదని అన్నారు. కొంత మంది టీచర్ల పిల్లలు జివనైల్ డయాబెటిస్‌తో బాధపడే వారున్నారని చెప్పారు.వారికి రెగ్యులర్‌గా ట్రీట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు ఒక చోట ఉండలేని స్థితి ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు. అలాంటి వారికి ఈ బదిలీలతో చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. విద్యాశాఖ మంత్రి .. చీఫ్ సెక్రటరీ టీచర్ల బదిలీలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. 

 సమగ్రంగా స్టడీ చేయకుండా .. అదరా బాదరాగా బదిలీలపై నిర్ణయం సరికాదన్నారు.టీచర్ల బదిలీలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నానని వివరించారు. టీచర్ల బదిలీలపై ప్రభుత్వం సరైన నిర్ణయంతో బదిలీలు చేయకపోతే పిల్లలపై ప్రభావం పడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఉద్యోగులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నార‌నీ, మనస్థాపానికి, మనోవేదనకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వం పునరాలోచించాలని వాపోతున్నారు.

జూనియర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిందని, స్థానిక జిల్లాలోనే పుట్టి , పెరిగి, చదివి ఉద్యోగం చేస్తూ కేవలం జూనియర్ గా పరిగణించి ఇతర జిల్లాలకు నిర్బంధంగా బదీలీలు చేయడం సరికాదన్నారు. మన ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎన్నో ప్రయోజనాలు చేకూర్చుతూ ఈ జూనియర్ల పట్ల ఎందుకు వివక్షత చూపుతుందో  ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఉద్యోగులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నార‌నీ, మనస్థాపానికి, మనోవేదనకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వం పునరాలోచించాలని వాపోతున్నారు.

Read Also: కేసీఆర్‌కు షాకివ్వనున్న డీఎస్ .. త్వరలో కాంగ్రెస్‌ గూటికి, మంతనాలు జరుపుతోన్న హైకమాండ్

అలాగే..  అనారోగ్య సమస్యలు ఉన్న తల్లిదండ్రులను విడిచి .. ట్రాన్స్ఫర్ పేర్ల వారిని దూరం చేయొద్దని ఆగ్ర‌హించారు. ఈ జీవోపై సమగ్ర స్టడీ- గందరగోళం రాకుండా బదిలీలు చేయాలని.. టీచర్ల బదిలీల్లో ఫైరవిలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల స‌మ‌స్య‌లు  తెలుసుకొని బదిలీలు చేస్తే బాగుంటుందని, ముఖ్యంగా  విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేస్తే విద్యా వ్యవస్థపై తీవ్ర ప‌డుతోంద‌ని,  సరైన మార్గదర్శకాలు లేకుండా బదిలీలు చేస్తే విద్యార్థుల భవిష్యత్ పై ప్ర‌భావ‌ప‌డుతోంద‌ని అన్నారు.  

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?