‘‘ మావోళ్లని బాగా చూసుకో అన్నా’’ .. కేటీఆర్- జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ

Siva Kodati |  
Published : Dec 16, 2021, 07:19 PM IST
‘‘ మావోళ్లని బాగా చూసుకో అన్నా’’ .. కేటీఆర్-  జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ

సారాంశం

సంగారెడ్డి (sangareddy) కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ (ktr), ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jaggareddy) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ పలకరించారు కేటీఆర్. అయితే మీరే తమను చూసుకోవాలంటూ జగ్గారెడ్డి సమాధానం ఇచ్చారు.

సంగారెడ్డి (sangareddy) కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్ (ktr), ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jaggareddy) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ పలకరించారు కేటీఆర్. అయితే మీరే తమను చూసుకోవాలంటూ జగ్గారెడ్డి సమాధానం ఇచ్చారు. గురువారం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. స్థానికంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు రూ. 6 కోట్ల ఏడు లక్షల నిధులతో భూమి పూజ చేశారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో లో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసం అధికారిక కార్యక్రమాలలో జగ్గారెడ్డి భూమి పూజలు పాల్గొన్నారు.

Also Read:ట్రబుల్ షూటర్ ట్రబుల్స్‌లో పడ్డారు: మంత్రి హరీష్‌పై జగ్గారెడ్డి

అనంత‌రం సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్న నిరుపేదలు ఐదువేల మందికి ఇండ్ల స్థలాలు, డ్వాక్రా మహిళల భవనాలకు నిధులు, రంగారెడ్డి నియోజకవర్గానికి 996 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ను కోరారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి సంభాషణ తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu