పాలమాకులలో రాహుల్ వద్దకు దూసుకొచ్చిన వ్యక్తి: కాళ్లు పట్టుకొన్న వ్యక్తిని తీసుకెళ్లిన పోలీసులు

By narsimha lode  |  First Published Oct 31, 2022, 6:19 PM IST

సెక్యూరిటీ వలయాన్ని చేధించుకొని రాహుల్ గాంధీ వద్దరకు ఓ వ్యక్తి ఇవాళ దూసుకువచ్చారు. రాహుల్  గాంధీ కాళ్లు పట్టుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పక్కకు తీసుకెళ్లారు.


హైదరాబాద్:  భద్రత వలయాన్ని  చేధించుకొని  ఓ వ్యక్తి సోమవారంనాడు భారత్  జోడో యాత్రలో ఉన్న   రాహుల్  గాంధీ  వద్దకు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లారు.

 సోమవారంనాడు షాద్ నగర్ నుండి ప్రారంభ మైన రాహుల్  గాంధీ యాత్ర  పెద్దషాపూర్ కు చేరుకోవాలి. పెద్దషాపూర్ లో సభ ఏర్పాటు చేశారు. పెద్దషాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న పాలమాకులలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వచ్చి  రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నాడు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ వ్యక్తిని  బలవంతంగా  అక్కడి నుండి తీసుకెళ్లారు.

Latest Videos

undefined

సెక్యూరిటీ వలయాన్ని  చేధించుకుంటూ వెళ్లి రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకోవడంతో  కొద్దిసేపు అంతా కంగారు పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది   అతడిని  బలవంతంగా  తీసుకెళ్లారు. ఈ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ తాను ఎవరిని కలవాలనుకొంటారో వారికే అనుమతి  ఇవ్వనున్నారు.పెద్ద షాపూర్ లో ఇవాళ సాయంత్రం జరగాల్సిన మీటింగ్ ను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్రలో ఈ  తరహ ఘటన రెండోదిగా  కాంగ్రెస్ పార్టీ  నాయకులు చెబుతున్నారు. గతంలో కూడ ఇలానే ఓ వ్యక్తి  రాహుల్  వద్దకు దూసుకొచ్చారని  ఆ  పార్టీ  నేతలు గుర్తు చేస్తున్నారు. రాహుల్ చుట్టూ భద్రతను సెక్యూరిటీ  సిబ్బంది కట్టుదిట్టం  చేశారు.

ఈ నెల 23న  తెలంగాణలోకి రాహుల్  గాంధీ పాదయాత్ర ప్రవేశించింది.  పాదయాత్ర  ప్రవేశించిన రోజునే  మధ్యాహ్నం  యాత్ర నిలిచిపోయింది. దీపావళిని పురస్కరించుకొని   పాదయాత్రకు మూడు రోజులు బ్రేక్ ఇచ్చారు రాహుల్  గాంధీ.ఈ నెల  27  నుండి  రాహుల్  గాంధీ  పాదయాత్ర పున: ప్రారంభమైంది.

also read:రేపు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే.. రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనున్న కాంగ్రెస్ అధ్యక్షుడు..

ఈ ఏడాది సెప్టెంబర్ 7న  తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో   భారత్  జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడు,కేరళ,  ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటకల మీదుగా యాత్ర తెలంగాణ  రాష్ట్రంలోకి  ప్రవేశించింది.రాష్ట్రంలో 14 రోజుల  పాటు యాత్ర సాగనుంది.  తెలంగాణ నుండి  మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది.కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్ర సాగుతుంది. 3500 కి.మీ పాదయాత్ర  చేయనున్నారు రాహుల్  గాంధీ.

కాంగ్రెస్ పార్టీ  చీఫ్ మల్లికార్జున  ఖర్గే రేపు హైద్రాబాద్ కు వస్తున్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న  యాత్రలో  ఆయన పాల్గొంటారు.  అంతేకాదు సాయంత్రం  నిర్వహించే  కార్నర్  మీటింగ్ లో  ఖర్గే పాల్గొంటారని ఆ పార్టీ  సీనియర్  నేత  జైరాం రమేష్ ప్రకటించారు.దేశాన్ని బీజేపీ  విచ్ఛిన్నం  చేసే ప్రయత్నం  చేస్తుందని  కాంగ్రెస్ విమర్శిస్తుంది. దేశానని  ఐక్యం  చేసేందుకు తాను ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టుగా  రాహుల్  గాంధీ  చెప్పారు.


 


 

click me!