టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చాలని అనుకోలేదు:కేసీఆర్ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

By narsimha lode  |  First Published Nov 4, 2022, 1:38 PM IST


 తమ పార్టీలో ఎవరినైనా చేర్చుకోవాలంటే కొన్ని పద్దతులున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు..మధ్యవర్తుల ద్వారా  తాము పార్టీలో  చేర్చుకొనే పద్దతి లేదన్నారు.


న్యూఢిల్లీ:కేసీఆర్  ప్రభుత్వం కూల్చాలని  తాము అనుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రోహిత్  రెడ్డితో ప్రభుత్వం కూలిపోతుందని అనుకుంటే తాము చేసేదేమీ లేదన్నారు.2023 ఎన్నికల వరకుతాము ఎదురు చూస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.

న్యూఢిల్లీలో  శుక్రవారంనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో  మాట్లాడారు. మొయినాబాద్  పాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల  అంశానికి  సంబంధించి తెలంగాణ  సీఎం కేసీఆర్  గురువారంనాడు రాత్రిమీడియా  సమావేశంలో కొన్ని వీడియోలను విడుదల చేశారు.  ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ  ప్రమేయం  ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై  కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి  స్పందించారు.

Latest Videos

తమ  పార్టీ  ఎమ్మెల్యేలపైనే   కేసీఆర్ కు విశ్వాసం లేదన్నారు.తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  ఏమైనా నీతివంతుడా  అని ఆయన ప్రశ్నించారు.ఫాం  హౌస్ ఘటనలో పాల్గొన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు  ఏ  పార్టీ నుండి వచ్చారో  చెప్పాలని ఆయన  ప్రశ్నించారు.  ఫాంహౌస్  వీడియోల పేరుతో కేసీఆర్  పాత రికార్డును తిరగేశారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా  చేశారు.  నిన్నటి సీఎం  మీడియా  సమావేశంలో వీడియోల ప్రదర్శనలు  కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా  ఉందని ఆయన  ఎద్దేవా  చేశారు.

తమ  పార్టీలో  చేర్చుకోవాలంటే తమ పార్టీ నేతలే నేరుగా  ఎమ్మెల్యేలతో  మాట్లాడుతారన్నారు. కానీ స్వామిజీలను మధ్యవర్తులుగా  పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలను  కొనుగోలు  చేయాల్సిన అవసరం తమకు ఏమీ లేదని కిషన్ రెడ్డి చెప్పారు. బ్రోకర్లను మధ్యలో పెట్టి  ఎమ్మెల్యేలను  కొనుగోలు చేయాల్సిన ఖర్మ తమకు  పట్టలేదని ఆయన  చెప్పారు.  నెలలో 15  రోజులు ఫాంహౌస్ లో  ఉండే కేసీఆర్  ప్రజాస్వామ్యం గురించి  మాట్లాడుతారా అని  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సామాన్యులను ఎప్పుడైనా కలిశారా అని  కేసీఆర్ ను ఆయన అడిగారు.ఫాంహౌస్ లో ఆర్ఠిస్టులు కూర్చొని అందమైన అబద్దాన్ని వీడియోలో  చూపించారన్నారు.పార్టీలో చేర్చుకొనేందుకు తమకు  స్వామిజీలు అవసరమా అని ఆయన అడిగారు. గతంలో  తమ  పార్టీలో  చేరినవారు స్వామిజీలు లేదా మధ్యవర్తుల ద్వారా  చేరారా అని  కిషన్  రెడ్డి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల వరకు తాము ఎదురు చూస్తామన్నారు. తమకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్నారు.మనుగోడులో కోమటిరెడ్డి విజయంతో తమ ఎమ్మెల్యేల సంఖ్య  నాలుగుకి చేరుతుందని  కిషన్  రెడ్డి  చెప్పారు.సీబీఐను అడ్డుకొనేందుకు పాత  తేదీలతో కేసీఆర్ సర్కార్  జీవోలు తెచ్చిందన్నారు. జయప్రకాష్ నారాయణ  గురించి మాట్లాడే  నైతికత  కేసీఆర్ కు లేదని కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి చెప్పారు.

ఈ విషయమై తాము సిట్టింగ్  జడ్జితో విచారణకు  డిమాండ్  చేస్తే  దానికి టీఆర్ఎస్సర్కార్ సిద్దంగా లేదన్నారు. కానీ  ఫాం హౌస్  వీడయోలు  సీజేలకు పంపుతామని చెప్పడాన్ని  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి తప్పుబట్టారు.గతంలో బీఎస్పీ,  టీడీపీ, కాంగ్రెస్  పార్టీల నుండి టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు  చేరిన  విషయాన్ని  కిషన్ రెడ్డి గుర్తు చేశారు.  టీఆార్ఎస్ లో  చేరిన  ఒక్క ఎమ్మెల్యేతోనైనా  రాజీనామా చేయించారా అని కిషన్  రెడ్డి ప్రశ్నించారు.

alsoread:మొయినాబాద్ ఫాంహౌస్ వీడియోలపై ప్రమాణం చేయాలి:కేసీఆర్ కు తరుణ్ చుగ్ సవాల్

గతంలో  ఎన్టీఆర్  ప్రభుత్వం  కూల్చివేత  గురించి కేసీఆర్ మాట్లాడారన్నారు. ఎన్టీఆర్  ప్రభుత్వం  కూలిపోయిన సమయంలో  వైస్రాయి  హోటల్ లో ఎవరున్నారని  కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై  చెప్పుులు వేసిన  విషయాన్ని  మర్చిపోయారా అని కేసీఆర్ ను కిషన్ రెడ్డి అడిగారు.

click me!