టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావడంపై హైకోర్టు ఆరా

By narsimha lode  |  First Published Nov 4, 2022, 12:59 PM IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశానికి సంబంధించిన విచారణపై స్టే  కొనసాగుతుందని తెలంగాణ హైకోర్టు శుక్రవారంనాడు ప్రకటించింది.  ఈ కేసు విచారణను  సోమవారానికి వాయిదా వేసింది.


హైదరాబాద్:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  ప్రలోభాల కేసు  విచారణను తెలంగాణ  హైకోర్టు  సోమవారానికి వాయిదా వేసింది.విచారణపై  స్టే కొనసాగుతుందని హైకోర్టు ప్రకటించింది.ఈ  విషయమై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్  దాఖలు  చేసింది.  ఈ  కేసుకు సంబంధించిన  ఆడియో,వీడియోలు బహిర్గతం కావడంపై హైకోర్టు ఆరా  తీసింది.ఎమ్మెల్యేల ప్రలోభాల  అంంశంపై  విచారణపై ఉన్న  స్టే  యథాతథంగా  కొనసాగుతుందని  హైకోర్టు తెలిపింది.చార్జీషీట్  ధాఖలయ్యే వరకు  ఆడియో, వీడియోలు బయటకు  రాకూడదని హైకోర్టు ఆదేశించింది. వీడియో  ఆధారాలను అనుమతించాలని రిజిస్ట్రార్ కు  హైకోర్టు ఆదేశించింది.

మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనపై  ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని  బీజేపీ డిమాండ్ చేసింది.ఈ మేరకు తెలంగాణ  హైకోర్టులో ఆ పార్టీ గత నెల  27న  రిట్ పిటిషన్ దాఖలు  చేసింది. పైలెట్ రోహిత్  రెడ్డి,బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు,రేగా కాంతారావులను ముగ్గురు వ్యక్తులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు  తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని  టీఆర్ఎస్  ఆరోపించింది.  ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.

Latest Videos

ఈ విషయమై ప్రత్యేక  బృందంతో  విచారణ  జరిపించాలని కోరుతూ  బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణపై  స్టే ను ఈ నెల 3వ తేదీ వరకు స్టే విధించింది హైకోర్టు. ఇవాళ ఈ  పిటిషన్ పై  విచారణ జరిపింది  హైకోర్టు.  స్టే  యథాతథంగా ఉంటుందని తెలిపింది. 

click me!