కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్: 13 వేల మంది వాలంటీర్లపై ప్రయోగం

Published : Dec 22, 2020, 01:22 PM IST
కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్: 13 వేల మంది వాలంటీర్లపై ప్రయోగం

సారాంశం

కరోనా వ్యాక్సిన్  కోవాగ్జిన్ కు చెందిన మూడో దశ ట్రయల్స్  పురోగతిని భారత్ బయోటెక్  మంగళవారం నాడు ప్రకటించింది. ఇప్పటివరకు 13 వేల మంది వాలంటీర్లకు కోవాగ్జిన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకొన్నట్టుగా ప్రకటించిం

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్  కోవాగ్జిన్ కు చెందిన మూడో దశ ట్రయల్స్  పురోగతిని భారత్ బయోటెక్  మంగళవారం నాడు ప్రకటించింది. ఇప్పటివరకు 13 వేల మంది వాలంటీర్లకు కోవాగ్జిన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకొన్నట్టుగా ప్రకటించింది.

ట్రయల్స్ కోసం 26 వేల మందిని లక్ష్యంగా చేసుకొని  లక్ష్యం సాధించే దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్ మూడో దశ మానవ క్లినికల్ ట్రయల్స్ ఈ ఏడాది నవంబర్ మధ్యలో ప్రారంభమైంది. 

కోవాగ్జిన్ మొదటి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్  లో వెయ్యి మంది వాలంటీర్లపై ప్రయోగాలు చేశారు.  ఈ ప్రయోగం సక్సెస్ అయినట్టుగా గతంలోనే భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది.  

కోవాక్సిన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో అభివృద్ది చేస్తున్నారు. వలంటీర్ల ఎంపిక చాలా కష్టమని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ప్రకటించింది.  

మూడో దశలో 26 వేల మందిని ఎంపిక చేసుకోవాలని భారత్ బయోటెక్ లక్ష్యంగా ప్రకటించింది. అయితే ఇప్పటివరకు 13 వేల మంది వాలంటీర్లపై  టీకా ప్రయోగించారు. మిగిలిన వారిపై కూడ త్వరలోనే వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే