హైదరాబాద్ ఫిలింనగర్ లో బెంజ్ కారు బీభత్సం..

By SumaBala Bukka  |  First Published Jul 31, 2023, 12:51 PM IST

హైదరాబాద్ ఫిలింనగర్ ఓ ఆదివారం సాయంత్రం ఓ ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో వాచ్మెన్ దంపతులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఓ బెంచ్ కారు బీభత్సం సృష్టించింది.  ఓవర్ స్పీడ్ తో చెట్టు, కరెంటు పోల్, గోడను వరుసగా ఢీ కొట్టుకుంటూ వెళ్లింది. ఆ తరువాత ఓ గుడిసెకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో  కారులోని మహిళ ప్రాణాలతో బయటపడింది. గుడిసెలో వాచ్మెన్ ఫ్యామిలీకి తప్పిన ప్రాణాపాయం తప్పింది. 

రామానాయుడు స్టూడియోకు సమీపంలో ఎలక్ట్రికల్ బెంజ్ కారు ఆదివారం నాడు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన ఓ కారు అదుపుతప్పి ముందు చెట్టును ఢీ కొట్టింది. అక్కడినుంచి.. కరెంట్ పోల్ ను ఢీ కొట్టింది. అది పూర్తిగా విరిగి కిందపడిపోయింది. ఆ తరువాత గోడను ఢీ కొట్టగా.. అది బ్రేక్ అయ్యింది. కింద అంతా దుబ్బల్లాగా మట్టి, రాళ్లు పేరుకుపోయి ఉండడంతో గోడను ఢీ కొట్టి ఆగిపోయింది. 

Latest Videos

స్నేహితుడిని చంపి ఇంట్లో పూడ్చి పెట్టాడు..

అలా ఆగకపోతే.. నేరుగా ఓ గుడిసెలోకి దూసుకుపోయేదని అక్కడివారు చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తుల నివాసం ఉంటున్న ఓ గుడిసెకు ఒక అడుగు దూరంలోనే కారు ఆగిపోయింది. గుడిసెలో వాచ్మెన్ దంపతులు నివసిస్తున్నారు. కారు అదే స్పీడ్ తో వెళ్లుంటే వారిద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవంటున్నారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కారులో ఉన్న యువతి మద్యం తాగి మత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం తరువాత కారులోంచి. బయటికి దిగిన మహిళ చెప్పులు భుజాన వేసుకుని.. నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆ కారు ఎలక్ట్రికల్ కారు అని తెలుస్తోంది. 

ప్రమాద సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలం నుంచి కారును పీఎస్ కు తరలించారు. అయితే, కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!