
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండిగ్ చేశారు. వివరాలు.. బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన ఇండిగో విమానం 6E897లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 6.15 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ విమానంలో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని డీజీసీఏ తెలిపింది.