నాంపల్లి అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా డాక్టర్ దుర్మరణం... మృతుల వివరాలివే (వీడియో)

By Arun Kumar P  |  First Published Nov 13, 2023, 3:34 PM IST

 హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చాలామంది ప్రాణాలను బలితీసుకుంది.  మృతుల్లో  ఓ డాక్టర్ తో సహా ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. 


హైదరాబాద్ : హైదరాబాద్ లో ఇవాళ ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం మారణహోమం సృష్టిస్తోంది. ఓ నివాస భవనం గ్రౌండ్ ప్లోర్ లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 50 ఏళ్లు పైబడిన వృద్దులతో పాటు నాలుగు రోజుల పసికందు కూడా ప్రాణాలు కోల్పోయింది.  

 అగ్నిప్రమాద మృతుల వివరాలు : 

Latest Videos

undefined

(1) మహ్మద్ ఆజమ్ (54) 

(2) మహ్మద్ హసీబుర్ రెహమాన్ 

(3) రెహానా సుల్తానా (50)

(4) తహూరా ఫర్హీన్ (38) 

(5) తూభ  

(6) తరూబా 

(7) ఫైజా సమీన్ (25)  

తహూర ఫర్హీన్ బిడిఎస్ డాక్టర్. ఆమె బంధువులు ఈ బిల్డింగ్ లో వుండటంతో ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడికి వచ్చింది. ఇంతలోనే అనుకోని విధంగా అగ్నిప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు. 

Read More  నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనాస్థలిలో ఉద్రిక్తత, లాఠీఛార్జ్.. ఎందుకంటే...

అగ్ని ప్రమాదం జరిగిన అపార్ట్ మెంట్ కింది భాగంలో గత కొన్నేళ్లుగా ఓ కెమికల్ గోడౌన్ ఉంది. అది జీ ప్లస్ 4 అంతస్తుల భవనం. ఉదయం వేళ మంటలు వ్యాపించి కేవలం సెకన్ల వ్యవధిలో దట్టమైన పొగల బిల్డింగ్ మొత్తాన్ని వ్యాపించాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి పోలీసులు, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. కానీ అప్పటికే ప్రమాదకరంగా పొగలు వ్యాపించడంతో కొందరు మృత్యువాతపడ్డారు. 

ఆ భవనంతో మొత్తం 60మంది నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. కెమికల్ అంటుకుని పొగలు 4వ అంతస్తు వరకు వ్యాపించడంతొ అందులోని వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేసాయి.

వీడియో

ఘటనస్థలిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ దైర్యం చెప్పారు. 

click me!