BC Bandhu: బీసీ బంధుకు తాత్కాలిక బ్రేక్.. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

By Mahesh K  |  First Published Dec 11, 2023, 12:47 AM IST

బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ బంధుపై రివ్యూ నిర్వహిస్తామని, అప్పటి వరకు ఆ పథకాన్ని తాత్కాలికంగా నిలిపేస్తామని చెప్పారు. ఆర్టీసీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదని, దానిపైనా సమీక్ష జరుపుతామని వివరించారు.
 


హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే.. ఆయన ఆర్టీసీ విలీనంపైనా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పూర్తి స్థాయిలో జరగలేదనితెలిపారు. ఈ పథకంపై త్వరలో సమీక్ష జరుపుతామని, ఆ సమీక్ష చేసే వరకు పథకాన్ని నిలిపేస్తామని తెలిపారు. అలాగే.. ఆర్టీసీ విలీనంపైనా సమీక్ష చేస్తామని వివరించారు. 

సమీక్ష నిర్వహించిన తర్వాత బీసీ బంధు అర్హుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ గందరగోళంగా ఉన్నదని విమర్శించారు. అసలైన అర్హులకు స్కీమ్ ఫలాలు అందేలా లేవని ఆరోపణలు చేశారు. కానీ, తాము అలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.

Latest Videos

Also Read: Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ విలీనంపైనా కామెంట్లు చేశారు. ఆర్టీసీ ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం కాలేదని తెలిపారు. దీనిపైనా త్వరలోనే ఓ రివ్యూ నిర్వహిస్తామని చెప్పారు. సమీక్ష జరిపి ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రజలకు ఉభయ పక్షాలకు ప్రయోజనకరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టి వారం రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రైతు బంధు గురించి విమర్శలు చేస్తున్నారని, వారి విమర్శలు తనకు విచిత్రంగా అనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అన్ని హామీలను అమలు చేసి తీరుతుందని వివరించారు.

click me!