పాలన గాలికి.. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీ : తెలంగాణ ఐఏఎస్‌లపై ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 28, 2022, 08:24 PM IST
పాలన గాలికి.. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీ : తెలంగాణ ఐఏఎస్‌లపై ఆర్. కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణలోని ఐఏఎస్ అధికారులపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీసీ సంక్షేమ సంఘం (bc welfare association) జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య (r krishnaiah) ఐఏఎస్ అధికారుల (ias officials)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఐఏఎస్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. అధికారాలను మరిచిపోతున్నారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఉద్యోగాన్ని, పాలనను మర్చిపోయి కోట్ల రూపాయాలను సంపాదించే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

అధికారం ఉంది కదా అని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలకు చదువులు చెప్పే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచర్లుగా పనిచేస్తున్న 950 మంది అధ్యాపకులను, ఉపాధ్యాయులను అకారణంగా తొలగించారని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లపై ప్రధాని మోడీ , ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఫిర్యాదు చేయనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. అంతకుముందు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో తొలగించిన ఉపాధ్యాయులతో కలిసి ఆర్ కృష్ణయ్య ధర్నా నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్