సీఐ దూషణ వ్యవహారంపై మహేందర్ రెడ్డి విచారణం.. పోలీసులంటే ఎంతో గౌరమని వెల్లడి..

Published : Apr 28, 2022, 06:05 PM ISTUpdated : Apr 28, 2022, 06:43 PM IST
సీఐ దూషణ వ్యవహారంపై మహేందర్ రెడ్డి  విచారణం.. పోలీసులంటే ఎంతో గౌరమని వెల్లడి..

సారాంశం

తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దూషించినట్టుగా ఉన్న ఆడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాండూరు సీఐ దూషణ వ్యవహారంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. 

తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దూషించినట్టుగా ఉన్న ఆడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మహేందర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చారు. ఈ క్రమంలోనే తాండూరు సీఐ దూషణ వ్యవహారంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. పొరపాటున నోరుజారి మనసు నొప్పించినందుకు విచారిస్తున్నానని చెప్పారు. పోలీసులు తన కుటుంబ సభ్యులతో సమానం అని అన్నారు. పోలీసుల మనసు నొప్పిస్తే.. తనుకు కూడా బాధగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్దిలో పోలీసుల కృషి అభినందనీయం అన్నారు. పోలీసులంటే ఎనలేని గౌరవం ఉందని చెప్పారు. 

ఇక, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఐ  రాజేందర్ రెడ్డిని దూషించినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్ గా మారింది.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆడియోను వైరల్ చేశారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు.  గతంలో యాలాల ఎస్ఐగా రాజేందర్ రెడ్డి పనిచేసిన సమయంలో కూడా ఇలానే చేశారని ఆయన ఆరోపించారు. సీఐ రాజేందర్ రెడ్డి అంటే తనకు అభిమానమని ఆయన చెప్పారు.

ఈ నెల ఈ నెల 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. 

ఇందుకు సంబంధించి గురువారం ఉదయం మీడియాతో మాట్లాడిన మహేందర్ రెడ్డి.. తాండూరు సీఐతో పాటు రూరల్ సీఐతో తాను ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. అయితే  తాను సీఐ రాజేందర్ రెడ్డిని దూషించలేదన్నారు. సీఐ రాజేందర్ రెడ్డిని దూసించినట్టుగా ున్న ఆడియో తనది కాదన్నారు. ఈ విషయమై తాను చట్టపరంగా ఎదుర్కొంటానని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు పోలీసులంటే గౌరవమని చెెప్పారు.  యాలాల ఎస్ఐ గా రాజేందర్ రెడ్డి పనిచేసన సమయంలో ఇలానే వ్యవహరించారన్నారు. 1994 నుండి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు.

. తాండూరు లో పనిచేసిన పోలీసులకు తానంటే ఏమిటో తెలుసునని మహేందర్ రెడ్డి వివరించారు.చట్టపరంగా తాను ఎదుర్కొంటానని పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ తరహా ఘటనల వెనుక స్థానిక  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే చుట్టూ రౌడీ షీటర్లున్నారని ఈ విషయాన్ని తాను సీఐని అడిగిినట్టుగా మహేందర్ రెడ్డి చెప్పారు. సీఐ రాజేందర్ రెడ్డిని దూషించిన  ముందు రోజే యాలాల ఎస్ఐని మహేందర్ రెడ్డి దూషించిన ఘటన చోటు చేసుకంది.

మరో వైపు తాండూరు సీఐ రాజేందర్ రెడ్డికి ెమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మద్దతు పలికారు. ఈ రకమైన వ్యాఖ్యలు మహేందర్ రెడ్డి చేయకూడదన్నారు. తాండూరు నుండే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. తనకు మహేందర్ రెడ్డి పోటీయే కాదన్నారు. సర్వేల్లో తనకే అనుకూలంగా నివేదికలు వచ్చాయని రోహిత్ రెడ్డి చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House