బతుకమ్మ చీరలు భగ్గున కాలినయ్ (వీడియోలు)

First Published Sep 18, 2017, 12:12 PM IST
Highlights
  • బతుకమ్మ చీరలు కాలబెట్టిన మహిళలు
  • జగిత్యాల, భువనగిరిలో మహిళల ఆగ్రహం
  • చీరలు కాల్చి బతుకమ్మ  ఆడి నిరసన

 

తెలంగాణ సర్కారు ఎంతో ఆర్భాటంగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. సర్కారు ఇచ్చిన చీరలపై మహిళా లోకం భగ్గుమన్నది. నాసిరకమైన చీరలు ఇచ్చిర్రని కొందరు మహిళలు విమర్శలు గుప్పించారు.

సర్కారు ఇచ్చిన చీరలు 50 రూపాయలు కూడా విలువ చేయవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఇచ్చిన బతుకమ్మ చీరలను కొందరు మహిళలు తిరస్కరించారు. ఇంకొందరు ఆ దిక్కుమాలిన చీరలు మాకొద్దంటూ కాలబెట్టారు. వాటిని కాలబెట్టి ఆ మంట చుట్టూ బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.

 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో బతుకమ్మ చీరల పంపిణీలో గందరగోళం నెలకొంది. నాణ్యత లేని చీరలు పంపిణీ చేశారంటూ మహిళల ఆందోళన చేపట్టారు. చీరలను కింద పడేసి బతుకమ్మ ఆడుతూ మహిళల నిరసన వ్యక్తం చేశారు. చీరలను కాలబెట్టి నిరసన తెలిపారు. ఈ దిక్కుమాలిన చీరలు మీ ఇంట్లో వాళ్లు కట్టుకుంటారా అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి పాటలు పాడారు మహిళలు.

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలంలోని చల్ గల్ గ్రామం లో ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని మహిళలు నిరసన తెలిపారు. ధర్నా కూడా చేశారు. వీళ్లు కూడా సర్కారు చీరల తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.

 

 

 

 

 

 

click me!